అంతా నీదేభారం.. ఈవీఎంకు ఎమ్మెల్యే పూజలు

Update: 2018-11-22 09:09 GMT
హతవిధీ.. ఏమిటిదీ.. ఓట్లేసే ప్రజల కన్నా.. ఈ నేతలకు ఈవీఎం మెషీన్లే దేవుడిగా మారిన పరిస్థితి. మెషీన్లు ఏముంది.? జనాలు దేనికి ఓటేస్తే దాన్ని చూపుతాయి. కానీ ఈ బీజేపీ ఎమ్మెల్యే ఆ విషయాన్ని మరిచిపోయి.. ఓట్లు గుద్దే ఈవీఎం మెషీన్ కు పూజలు చేశారు. బొట్టు పెట్టి.. హారతి ఇచ్చి.. అగర్ బత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టేశాడు. తనను గెలిపించాలని ఈవీఎంకు పూజలు చేశాడు. చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకున్న ఈ వింత వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నెల 20న చత్తీస్ ఘడ్ లో చివరి దశ పోలింగ్ ముగిసింది.అదే రోజున నవగఢ్ బీజేపీ ఎమ్మెల్యే, తాజామాజీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన దయాల్ దాస్ బాఘెల్ ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంకు పూజలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. పోలింగ్ ప్రారంభానికి ముందుగా నవగఢ్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈ ఎమ్మెల్యే పూజలు చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది..

దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారులు ఎమ్మెల్యే దయాల్ దాస్ కు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ప్రతిపక్ష  కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోస్తోంది. 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి ఇలా ప్రజలను వదిలేసి యంత్రాలకు పూజలు చేయడం చూస్తుంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశాడేమోనని అర్థమవుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దయాల్ దాస్ దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News