విషయం ఏదైనా కానీ.. వివిధ వర్గాలకు చెందిన వారు ఎమోషనల్ అంశాల మీద స్పందిస్తుంటారు. కానీ.. కొన్ని వర్గాలు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభావితం కావు. అలాంటి కోవలోకి వస్తారు పోలీసులు.. పోలీసు అధికారులు. అసలేం జరిగినా.. ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారే తప్పించి.. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా దూరంగా ఉండటం కనిపిస్తుంటుంది. చివరకు మీడియాతో మాట్లాడే సమయంలోనూ సొంత అభిప్రాయాలను బయటపెట్టేందుక ససేమిరా అంటారు. ప్రస్తావించే అంశాలన్ని కూడా.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లడే ప్రయత్నం చేస్తారు.
అలాంటిది తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పోలీసు అధికారి శివ చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. అందులో శివ చేసన ప్రతిపాదనలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు. ఆయన చేసిన సాహసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ గుంటూరుజిల్లాకు చెందిన పోలీసు అధికారి చేసిన సంచలనం ఏమిటి? దాని వివరాలు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఈ విషయానికి వస్తే..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పోలీసు అధికారి శివ చేసిన సాహసం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ఫ్లెక్సీ మీద ‘రాజ్యాంగానని మార్చాలి అన్న కేసీఆర్ గారి మాటలకు మద్దతు ఇస్తున్నాము.. అందరూ స్పందించాలి’ అని పేర్కొంటూనే.. సదరు ఫ్లెక్సీలో ఏడమ వైపు పై భాగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కుడి వైపు పై భాగంలో ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఏడమ వైపు కింది భాగంలో చంద్రబాబు.. కుడి వైపు పవన్ కల్యాణ్ ఫోటోల్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని పేర్కొన్నారని.. ఆయన మాటలకు తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ మాటలకు తాను చాలా హ్యాపీగా ఉన్నానని.. పదేళ్లుగా ఈ విషయం మీద తాను చాలా మధనపడుతున్నానని.. ఎవరూ మాట్లాడటం లేదని తాను ఆవేదన చెందినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రతిపాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. అందులో తాను చెప్పిన రెండు విషయాల్ని తప్పకుండా పెట్టాలని.. తన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
పోలీసు అధికారి శివ పేర్కొన్న ఆ రెండు ప్రతిపాదనలు ఏమన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేయాలి. నా వైపు నుంచి రెండు విషయాలు చెబుతున్నా. అందులో మొదటిది రాజకీయ నేత చేతిలో పోలీసు ఉండకూడదు. రెండు.. ఎమ్మెల్యే వ్యవస్థ మనకు అవసరమా? ఎమ్మెల్యే స్థానంలో ఒక అధికారిని ఉంచితే.. భయంతో.. భక్తితో పని చేస్తాడు కదా? దయచేసి ఈ రెండు విషయాల్ని గమనించండి.
బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రాశారంటే.. ఆ రోజుల్లో స్వార్థ పరులు లేని వారి మధ్య రాశారు. ఈ రోజు స్వార్థం పెరిగిపోయి.. మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో మార్చి తీరాలి. ఎవరూ స్పందించటం లేదేంటి సార్? ముఖ్యంగా యువత. మీ మీ మాథ్యమాల్లో స్పందించండి. కుదరకపోతే వీడియోను షేర్ చేయండి బ్రదర్’ అని పేర్కొన్నారు.
మీడియా వాళ్లు తాను చెప్పిన అంశాలపై స్పందించాలని.. ఇది మేజర్ ఇష్యూ అని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్.. జగన్.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు స్పందించాలి’ అంటూ ఫ్లెక్సీలోని వారి ఫోటోల వైపు చూస్తూ పేర్కొన్నారు. రివేంజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని.. పోలీసులకు చెడ్డపేరు తీసుకురావొద్దన్నారు. 2023 తెలంగాణ.. 2024 ఏపీ ఎన్నికల నాటికి పాలకులు ఏదో ఒక నిర్ణయానికి రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించినా.. స్పందించకపోయినా.. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అమలు చేసి తీరాలన్నారు. మరి.. చిలకలూరిపేట పోలీసు అధికారి శివ వీడియోపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు.. రాజకీయ అధినేతలు.. ముఖ్యమంత్రులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
Full View