బ్రేకింగ్: చైనా కరోనా వ్యాక్సిన్ సక్సెస్ ఫుల్

Update: 2020-04-25 13:00 GMT
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా దాని నివారణలో కూడా విజయ సాధించింది. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ను ఆ దేశం కంట్రోల్ చేయగలిగింది. ఇప్పుడు ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకి మరణ మృదంగం వినిపిస్తోంది.

అయితే ప్రపంచాన్ని అల్లాడిస్తున్న ఈ వైరస్ పై చైనా గుడ్ న్యూస్ తెలిపింది. చైనాకు చెందిన మూడు సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. సీనో ఫార్మ్ అనే సంస్థ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూడు దశల వయసు కలిగిన 96మందిపై ట్రయల్స్ వేసిన సీనోఫార్మ్ సంస్థ అవన్నీ విజయవంతమయ్యాయని.. ఈ ట్రయల్స్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉన్నారని.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపింది.

ఇక హనన్ ప్రావిన్స్ లోని జియావోజౌ నగరంలో ర్యాండమ్, డబుల్ బ్లైండ్, ప్లాసిబో క్లినికల్ ట్రయల్స్ కూడా ఈ సంస్థ నిర్వహించింది. ఇవి కూడా సక్సెస్ అయినట్టు తెలిసింది. మూడో దశపూర్తయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఏడాది పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తంగా వ్యాక్సిన్ విజయవంతం కావడం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు రేపింది.
Tags:    

Similar News