అమెరికాలో కరోనావైరస్ పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్త బింగ్ లియు పెన్సిల్వేనియా రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. ఆయన ప్రఖ్యాతిగాంచిన పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. పిట్స్ బర్గ్ కు ఉత్తరాన రాస్ టౌన్ షిప్ లోని తన నివాసంలో లియు శనివారం అనుమానిత స్థితిలో శవమై కనిపించాడు. హోగు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. లియును కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హోగు మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. లియుకు మెడ, తల భాగంలో బుల్లెట్ గాయాలున్నాయని తెలిపారు. లియు, హోగులు ఒకరికి ఒకరు తెలుసని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతానికి లియుకు హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కరోనావైరస్ సోకినప్పుడు కణస్థాయిలో చోటు చేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజవేసిన సమయంలో లియు హత్యకు గురవడం గమనార్హం
ఈ నేపథ్యంలో అమెరికాపై చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అమెరికా ల్యాబ్‌లోనే వైరస్ సృష్టించబడిందనే విషయాన్ని కనుగొనడం వల్లే ప్రొఫెసర్ లియును హత్య చేశారని చైనా సోషల్ మీడియా వేదిక వైబోలో ఓ చైనా యూజర్ పేర్కొనడం గమనార్హం. కరోనావైరస్ సృష్టికి సంబంధించిన వాస్తవాలను కనిపెట్టడం మూలంగానే అమెరికా లియును హత్య చేసిందని చైనా నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. కరోనావైరస్ ను వూహాన్ ల్యాబ్‌లోనే చైనా సృష్టించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోపాటు అగ్రరాజ్య వర్గాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అటు చైనా కూడా అమెరికాపై ఆరోపణలు చేస్తోంది. కరోనా చైనా ల్యాబ్ లో సృష్టించబడలేదు అని WHO చెప్తున్నా కూడా ట్రంప్ చైనా పై ఆరోపణలు చేస్తున్నారు.