భారత్ ఎదుగుదలను ఏ మాత్రం ఓర్చుకోలేని దేశం పేర్లు చెప్పాలంటే అందరూ పాకిస్థాన్ పేరు మొదట చెబుతారు. కానీ.. చెప్పాల్సింది చైనా పేరే. భారత్ ఉన్నతిని అస్సలు భరించలేని డ్రాగన్ దేశం వేసే కుయుక్తులు అన్నిఇన్ని కావు. భారత్ ను దెబ్బ తీసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని దుర్మార్గం ఆ దేశం సొంతం.
ఇటీవల భారత్ -పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో చైనా దొంగచాటుగా దాయాది పక్షాన్నే వహించింది. రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే.. భారత్ ను దెబ్బ తీయాలన్న యోచనలో ఉందని చెబుతారు. డ్రాగన్ దేశ ఉద్దేశాన్ని గుర్తించి.. పాక్ వెనుక చైనా ఉన్న వైనాన్ని గమనించైనా ఆచితూచి అడుగులు వేయాలన్న సూచనతో పాటు.. రెండు దేశాల మధ్య మొదలయ్యే యుద్ధం అంతకంతకూ విస్తరిస్తుందన్న అమెరికా భయపడినట్లుగా చెబుతారు.
ఈ కారణంతోనే అమెరికా లోగుట్టుగా పాకిస్థాన్ మీద గట్టి ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా చెబుతారు. పాక్ కు చైనాకు మధ్యనున్న అనుబంధం.. వారి మధ్య ఉన్న రహస్య మైత్రి మరోసారి వెల్లడైంది. తాజాగా చైనా ఉప విదేశాంగ మంత్రి కాంగ్ జున్ యు పాక్ లో పర్యటిస్తున్నారు. పుల్వామా ఉగ్ర ఘటన నేపథ్యంలో దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించేందుకే కాంగ్ ఇస్లామాబాద్ వెళుతున్నట్లుగా చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు మీడియా సంస్థకు వెల్లడించింది. భారత్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికి పాక్ సంయమనం పాటిస్తుందని కాంగ్ వ్యాఖ్యానించటమే కాదు.. పాక్ వైఖరిని అభినందించటం విశేషం.
ఒకపక్క పాక్ కు వంత పాడుతూ.. తెర వెనుక పావులు కదుపుతున్న డ్రాగన్ దేశం.. బయటకు మాత్రం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు పాక్ ప్రభుత్వం రియాక్ట్ అయి చైనాకు ధన్యవాదాలు తెలిపిన వైనం చూస్తే.. రెండు దేశాల మధ్య నెలకొన్న దోస్తీ ఏ స్థాయిదో ఈ యవ్వారం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
ఉగ్రవాదానికి ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుండగా.. అందుకు భిన్నంగా పాక్ తో దోస్తానా చేస్తూ.. దాయాదితో తనకున్న స్నేహం ఏ స్థాయిదో అన్న విషయాన్ని చైనా తన తాజా చర్యతో చెప్పకనే చెప్పేసింది. ఇప్పటికైనా సరే.. భారత్ కు పక్కలో బల్లెంగా చైనా వైఖరిని గుర్తించి.. దేశ ప్రజలు చైనా వస్తువుల కొనుగోలు విషయంలో కచ్ఛితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించి పెద్ద ఎత్తున వారి వ్యాపార ప్రయోజనాల్ని దెబ్బ కొడితే కానీ డ్రాగన్ దేశానికి బుద్ధి రాదని చెప్పక తప్పదు. మీరు మాతో బాగుంటే.. మీ వ్యాపారం బాగుంటుంది. లేదంటే.. మొదటికే మోసం ఖాయమన్న విషయాన్ని తమ చేతలతో భారతీయులు చేసి చూపించాల్సిన అవసరం ఉంది.