మంత్రి పదవికి సరిపోయేంత రేంజ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునికి ఉంటుందని కొందరు ఫీలవుతుంటారు. మరికొందరు నేతలైతే.. తమకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకున్నా ఫర్లేదు.. టీటీడీలో మెంబర్‌గా అవకాశం ఇస్తే చాలని కోరుకునే వారు ఉంటారు.
ఇక మరికొందరైతే.. టీటీడీ బోర్డు ఛైర్మన్ అయితే చాలు.. అంతకు మించి ఇంకేం అక్కర్లేదని భావించేవారు ఉండటం తెలిసిందే. అందుకు ఉదాహరణ టీడీపీ ఎంపీ.. సీనియర్ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు. తనకు కానీ టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలే కానీ.. తన జీవితంలో మరే కోరిక కోరనని చెప్పారు. ఆయన అంతలా కోరుకున్నా.. ఆ పదవి దక్కకపోవటం వేరే విషయం అనుకోండి.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డిని ఏపీ సర్కారు నియమించింది. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఏపీలోని టీటీడీ బోర్డులో మెంబర్‌షిప్ లభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పవర్ పరిమితమైనా.. తిరుమల కొండ మీద మాత్రం సూపర్ పవర్ ఉండే అతి కొద్దిమందిలో చింతల ఒకరు కానున్నారు.