రాస‌లీల‌ల ఖాకీపై వేటు ప‌డింది

Update: 2018-01-23 08:13 GMT
ఒక‌రేమో ఏసీబీలో ఏఎస్పీ స్థాయి అధికారిణి. మ‌రొక‌రు క‌ల్వ‌కుర్తి సీఐ. ఇరువ‌రి మ‌ధ్య ఊహించ‌ని బంధం మొద‌లు కావ‌టం.. దానిపై ఏఎస్పీ అధికారిణి ఇంట్లో మొద‌లైన ర‌చ్చ చివ‌ర‌కు మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌చారం కావ‌టం తెలిసిందే.

ఏసీబీలో ఏఎస్పీగా వ్య‌వ‌హ‌రించిన సునీతారెడ్డితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌ల్వ‌కుర్తి సీఐ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హిళా అధికారి ఇంట్లో అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఇరువురు ఉన్న వేళ‌లో.. ఆమె భ‌ర్త ఇంటికి రావ‌టం.. ఇరువురిని నిల‌దీయ‌టం ఒక ఎత్తు అయితే.. సునీత త‌ల్లిదండ్రులు సీఐని చెప్పుల‌తో కొట్టిన వైనం  షాకింగ్ గా మారింది.

ఇద్ద‌రు ఖాకీలు చేసిన ప‌నిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. త‌న భ‌ర్త‌తో సంబంధాలు స‌రిగా లేవ‌ని.. వేర్వేరుగా ఉన్న‌ట్లుగా సునీత చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. వ‌న‌ప‌ర్తి సీఐ విష‌యంలో పోలీసు ఉన్న‌తాధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు పొక్కి ర‌చ్చ ర‌చ్చ అయిన నేప‌థ్యంలో మ‌ల్లికార్జున‌పై ఐజీ స్టీఫెన్ ర‌వీంద్ర వేటు వేశారు.

ఇప్ప‌టికే సీఐపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఏఎస్పీ సునీత‌తో తాను స‌న్నిహితంగా ఉండ‌టం నిజ‌మేన‌ని.. తామిద్ద‌రం ఇప్ప‌టికే విడాకుల కోసం అప్లై చేశామ‌ని.. అది వ‌చ్చిన వెంట‌నే తాము పెళ్లి చేసుకోనున్న‌ట్లుగా సీఐ చెప్పిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News