మా పథకాన్ని జగన్ కొట్టాడంటున్న బీజేపీ

Update: 2020-11-03 13:10 GMT
ఏపీ సిఎం వైయస్ జగన్ మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. నవంబర్ 6న ‘జగన్నన్న తోడు’ ప్రారంభించబోతున్నారు. ఈ పథకంలో చిన్న , వీధి వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. వారి బతుకులకు భరోసా కల్పించడం.. అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. ఈ పథకం లబ్ధిదారులకు రూ .10,000 రుణం ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. ‘జగనన్న తోడు’ కింద చిన్న వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తారు. రుణాలపై వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుండగా, లబ్ధిదారులు వాయిదాలలో అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కూరగాయల విక్రేతలు, వీధుల్లో కిరాణా విక్రేతలు, సైకిళ్లపై పండ్లు అమ్మకందారులు, రోడ్డు పక్కన తినుబండారాలు, వీధుల్లో ఆహారాన్ని అమ్ముకునే వ్యాపారులు ఈ పథకం పొందటానికి అర్హులు.

ఇప్పటికే, జగన్నన్న చేదోడు, జగనన్న విద్యా దీవేన, జగనన్న వసతి దీవేన, జగనన్న విద్యా కనుక, వైయస్ఆర్ భీమా, వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, వైయస్ఆర్ జలయజ్ఞం, వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ సహా అనేక సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. వైయస్ఆర్ ఆదర్శం, వైయస్ఆర్ కల్యాణ కానుక, వైయస్ఆర్ కాంతి వెలుగు, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ నవోదయం తదితర పథకాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ‘జగనన్న తోడు’ను సీఎం జగన్ ప్రకటించబోతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను సీఎం జగన్ "కాపీ" చేస్తున్నారని ఏపీ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం "పేరు మార్చడం" ద్వారా కేంద్రం పథకాలను "హైజాక్" చేస్తోందని వారు ఆరోపించారు. జగనన్న తోడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పిఎం ఎస్వనిధి’ పథకానికి కాపీ అని బిజెపి నాయకులు ఆరోపించారు. జగనన్న తోడు ‘పీఎం స్ట్రీట్ వెండర్స్ ’ ఆత్మనిర్భర్ నిధి (పిఎం ఎస్వనిధి) పథకమేనని వారు అంటున్నారు.

సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలను అందులో ముద్రించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లయితే దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తీసుకోకుండా మొత్తం ఖర్చులను భరించాలని సవాల్ చేస్తున్నారు.
Tags:    

Similar News