నాడు వైఎస్.. నేడు జగన్.. అరుదైన అవకాశం

Update: 2019-09-30 06:11 GMT
ఒకే కుటుంబం నుంచి.. అదీ సీఎం హోదాలో.. ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇంతటి అరుదైన అవకాశం ఎవ్వరికీ దక్కలేదట... తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో తండ్రీ కొడుకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లు సీఎం హోదాలో స్వామి సేవలో పాల్గొనడం అత్యంత అరుదైనదిగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారికి సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇదే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించగా.. మళ్లీ ఆయన తనయుడు కూడా సీఎం హోదాలోనే పట్టువస్త్రాలు సమర్పిస్తుండడం విశేషంగా మారింది.

టీటీడీ చరిత్రలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలేషుడికి పట్టువస్త్రాలు సమర్పించడం అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. సాయంత్రం ధ్వజారోహణ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం తరుఫున ఈ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గర్భగుడి లోకి వెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు.

సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ముందు పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు కూడా వెంకన్నను దర్శించుకున్నాకే సీఎం పీఠమెక్కారు. తిరుమలేషుడిని సెంటిమెంట్ గా మార్చుకున్న జగన్ ఇప్పుడు పట్టువస్త్రాలు కూడా తనే స్వయంగా సమర్పిస్తుండడం విశేషంగా మారింది.


Tags:    

Similar News