టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖాతాలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. ఇంకా చెప్పాలంటే...అనూహ్యమైన రికార్డ్. కేసీఆర్ బొమ్మతో నాణేలను ముద్రించారు. ఇలా నూతన ప్రయత్నం చేసింది ఎన్నారైలు కావడం విశేషం. అలా ముద్రించిన నాణేలను స్వయంగా కేసీఆరే ఇవాళ ఆవిష్కరించారు. తెలంగాణ కలను నెరవేర్చిన వ్యక్తిగా తాము ఈ ప్రత్యేక గుర్తింపును దక్కించామని వారు పేర్కొన్నారు.
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై ఉన్న అభిమానంతో కేసీఆర్ టీఆర్ఎస్ సపోర్టర్స్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు. వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటుగా పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా...ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నారైలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ ప్లీనరీ సందర్భంగా హాజరైన పలువురు సానుభూతిపరులైన ఎన్నారైలతో ప్రగతిభవన్ లో కేటీఆర్ ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేసిన కేసీఆర్ అనంతరం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నారైలు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ పథకాల గురించి విదేశాల్లో తెలియజేయాలని కోరారు. తన మదిలో మెదిలిన కాంగ్రెస్ - బీజేపీయేతర రాజకీయ కూటమి భారతదేశ చరిత్రను మార్చేదని పేర్కొంటూ...దాని గురించి విదేశాల్లో ప్రచారం చేయాలని కేసీఆర్ కోరారు.