తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు పోలీసులను ఫిధా చేసేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఊహించని తీపికబురు అందించారు. పోలీస్ శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఎఎస్పిలుగా - డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతీ పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు.
పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సీఐలకు డీఎస్పీలుగా, 103 మంది డీఎస్పీలకు ఎఎస్పీలుగా - 33 మంది ఎఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులు కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. ``అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అలాంటి న్యాయం జరగలేదు. దీనివల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. గతంలో ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు ప్రమాషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలి`` అని అన్నారు.
గతంలో భారీ స్థాయిలో వాహనాలు సమకూర్చి వారికి వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పదోన్నతులు కల్పించడంతో తెలంగాణ పోలీసులకు దీపావళి పదిరోజుల ముందే వచ్చినట్లయిందని అంటున్నారు. తాజా నిర్ణయంతో పోలీసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.