ఏదో కడుపుకూటికి అన్నదాతలు భూముల్లోంచి బోర్ల ద్వారా నీటిని తోడి సేద్యం చేసుకోవాలంటే.. దానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇచ్చి సహకరించడంలో అర్థం ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కి ప్రేమ పొంగుకొచ్చిందంటే.. ఆయన ప్రకటించే వరాల వర్షంలో ఎవరైనా సరే ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే. ఆయన ఏకంగా ఇళ్లలో ప్రభుత్వమే ఏసీలు పెట్టిస్తుందని, వాటికి కరెంటు కూడా ఉచితంగా ఇస్తుందని ప్రకటిస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తానికి కాదులెండి.. కేవలం సింగరేణి కార్మికుల వరకే. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ పార్టీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టినందుకు కార్మికులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్న కేసీఆర్.. వారికి అనేకానేక వరాలను ప్రకటించేశారు.
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిర్దిష్టమైన పరిష్కారాలు చూస్తామంటూ చెప్పడం వరకు ఒక ఎత్తు. సాధారణంగా ఎవ్వరైనా చెప్పవలసిన మాటలే. అలియాస్ పేర్లు ఉన్న వారికి రెగ్యులర్ పేర్లను మాత్రమే నమోదు చేయించడం - మెడికల్ బోర్డుతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించడం - అలాగే తాను ఇచ్చిన హామీ గనుక వారసత్వ ఉద్యోగాల వివాదాన్ని కొలిక్కి తేవడం వంటివి చేయాల్సిందే. అలాంటి హామీలన్నీ కూడా కేసీఆర్ ప్రకటించారు. కానీ.. ప్రతిపక్షాలు అన్నీ జట్టు కట్టినా తమ విజయపరంపరకు అడ్డుకట్ట వేయలేకపోయాయనే జోష్ లో ఉన్నారో ఏమో గానీ.. ఏకంగా కార్మికుల ఊహకు కూడా అందని అనేక వరాలను కూడా సీఎం ప్రకటించేశారు.
సింగరేణి పర్యటనకు త్వరలోనే వస్తా.. మీఇళ్లను - మీ బాత్రూములను కూడా చూస్తా.. అక్కడే బీపీ పరీక్షలు చేయించుకుంటా అంటూ వారికి ఆశలు రేపారు. వడ్డీలేని రుణాల మొత్తాన్ని పదిలక్షల వరకు పెంచడం వంటివి కూడా కేసీఆర్ ప్రకటించడం విశేషం.
అయితే ఒక్క విషయంలో కేసీఆర్ కార్మికుల మనసు గెలుచుకున్నారు. గతంలో కూడా తమ పార్టీ అనుబంధ సంఘాన్నే గెలిపించినప్పటికీ.. ఇన్నాళ్లుగా సింగరేణి కార్మికుల కోసం ఏమీ చేయలేకపోయా అని ఆయన ఒప్పుకున్నారు. ఇందుకు తనను క్షమించాలని కూడా కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడి, ఇతర పనుల ఒత్తిడిలో ఉన్నందువల్ల పట్టించుకోలేకపోయానని, ఇకపై మాత్రం అలా ఉండదని.. సింగరేణికి సంబంధించి.. అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. మొత్తానికి ఏసీలకు కూడా ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తాననే హామీలే సింగరేణి తో సంబంధం లేని సామాన్యులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.