కాగ్నిజెంట్ సాయం వింటే ఆశ్చర్యపోవాల్సిందే

Update: 2015-12-08 13:50 GMT
భారీ వర్షాలు.. వరదల కారణంగా భారీగా నష్టపోయిన చెన్నై మహానగరాన్ని ఆదుకోవటానికి భారీగా స్పందిస్తున్నారు. వ్యక్తులు.. గ్రూపులు.. ఎన్జీవోలు.. సంస్థలు.. ఇలా ఒకరేంటి.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేస్తున్నారు.

అయితే.. ఇప్పటివరకూ అందిన సాయాలు ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ప్రకటించిన సాయం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అంత భారీగా మొత్తాన్ని చెన్నై నగరాన్ని ఆదుకోవటానికి కాగ్నిజెంట్ ప్రకటించింది.
చెన్నై మహా నగరానికి మొత్తంగా రూ.260కోట్లు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో సుమారు రూ.65కోట్లు సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. మరో రూ.195కోట్లను వరద బాధితులకుసాయం చేసే ఎన్జీవోలకు.. ఛారిటీ సంస్థలకు అందించనన్నట్లు ఈ ఐటీ దిగ్గజం ప్రకటించింది. దేశంలో వివిధ నగరాల్లో కాగ్నిజెంట్ కు కార్యాలయాలు ఉన్నా.. చెన్నై ఆఫీసులోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. మొత్తంగా కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా కాగ్నిజెంట్ సాయం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News