ప్రఖ్యాత ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్.. తన ఉద్యోగులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన టాప్ లెవెల్ ఉద్యోగులు ఏ మాత్రం జీర్ణించుకోలేని నిర్ణయాన్ని తీసుకుంది. డిజిటల్ సాంకేతికతను సొంతం చేసుకునే క్రమంలో సీనియర్ మేనేజ్ మెంట్ లెవెల్ ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు రంగం సిద్దం చేసింది.
గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత మంది ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని భావిస్తున్న కంపెనీ సీనియర్ లెవెల్ ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ప్యాకేజీ ఒకటి సిద్దం చేసింది. డిజిటల్ పద్దతుల్లోకి మారేందుకు వీలుగా తాము నిర్ణయాన్ని తీసుకున్నామని.. నాణ్యత.. సుస్థిరాభివృద్ధిని సాధించే ప్రయత్నంలో భాగంగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కాఅసోర్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా తొమ్మిది నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ ఆఫర్ ను అసోసియేట్ డైరెక్టర్ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు.. వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రిక్రూట్ మెంట్ యథాతధంగా సాగుతుందని పేర్కొనటం గమనార్హం. తాజా నిర్ణయాన్ని చూస్తే.. కంపెనీకి బరువుగా మారిన సీనియర్ క్యాడర్ ను కంపెనీ వదులుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. జూనియర్ లెవెల్లో సమర్థులకు ప్రమోషన్లు ఇవ్వటం ద్వారా కీలక బాధ్యతలు అప్పగించటం.. అదే సమయంలో ఖర్చు తగ్గించే ప్రక్రియకు కంపెనీ శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/