కాకాణికి రెండింతలు ఇస్తా... కోల్డ్ వార్ స్టార్ట్ ...?

Update: 2022-04-13 09:23 GMT
వైసీపీలో మంత్రులు మాజీ మంత్రులు,  ఈ కో ఆర్డినేషనే ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది. నిన్నటిదాకా మంత్రులుగా రాజ్యాలు ఏలిన వారు గమ్మున ఉంటారా అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే కొత్త మంత్రులు తమ హవా చూపాలనుకుంటారు. దాంతో తొలి విడతలో పేచీలు పెద్దగా లేకపోయినా మలివిడతలో మాత్రం చాలానే వచ్చేట్లున్నాయి.

దానికి నాంది అన్నట్లుగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బిగ్ సౌండ్ చేశారు. తమ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం లేదంటూ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంతే కాదు, తనను పిలవలేదు కాబట్టే ఇలా మీడియా ఎదుట  చెబుతున్నాను, నిజంగా పిలిస్తే వెళ్ళనా అని  ఆయన ప్రశ్నించారు.

అంటే అనిల్ కాకాణి మధ్యన ఏదో కోల్డ్ వార్ ఉందనే విషయం ఇన్నాళ్ళకు అధికారికంగా ఆయన ప్రకటించినట్లుగా ఉంది. ఇక అంతటితో ఆగని అనిల్ కాకాణి అన్నకు నేను పూర్తిగా  సహకరిస్తాను అంటూ కొన్ని సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు.

నేను ఏదీ రుణంగా ఉంచుకోను, సాయమైనా ప్రేమ అయినా సహకారమైనా నాకు ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేయడం అలవాటు. అలా కాకాణి నేను మంత్రిగా ఉండగా నాకు పంచిన ప్రేమకు, కోపరేషన్ కి  రెండింతలు ఇస్తాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి అనిల్  ఏమిస్తారు, కాకాణి ఏమి పుచ్చుకుంటారు అని బోలెడు  సందేహాలు వస్తున్నాయి. అయితే  అలా డౌట్ పడితే ఎలా అబ్బా నేను క్లియర్ గానే మాట్లాడుతున్నాను అని అనిల్ అంటున్నారు.

మరి కాకాణి ఇంతటి ప్రేమను అనిల్ కి పంచితే ఆయన ప్రమాణానికి ఈయనను  పిలవకపోవడం ఏంటి అన్న డౌట్ వస్తోంది. అలాగే అనిల్ కూడా సెటైరికల్ గా ఒకటికి  రెండింతలు ఇస్తాను అంటున్నారు. సో ఏదో నెల్లూరు వైసీపీలో జరగబోతోందా అన్న చర్చ వస్తోంది.  గతంలో కూడా నెల్లూరు జిల్లాలో బడా నేతల మధ్య విభేదాలు ఉంటే ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామక్రిష్ణా రెడ్డి వాటిని సర్దుబాటు చేశారు.

ఇపుడు చూస్తే అనిల్ మాజీ అయ్యారు. కాకాణి మంత్రి అయ్యారు. ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉందనే టాక్ ఎపుడూ ఉంది. ఇపుడు రెట్టింపు ఇస్తాను అని అనిల్ అంటే నిజంగా కోల్ వార్ కాస్తా ముదిరి పాకాన పడుతుందా అన్న చర్చ వస్తోంది. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ ఏ పదవి ఇచ్చినా చేస్తాను, జగన్ కి సేవకుడిని అంటూనే కాకాణి మీద ఇండైరెక్ట్ గా తన మాటల కాక చూపిస్తున్నారు. చూడాలి మరి నెల్లూరు పాలిటిక్స్ ఇక మీదట హీటెక్కిపోవడమేనా.
Tags:    

Similar News