ప్ర‌శాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ వ‌దులుకుంది.. ఎందుకో తెలుసా?

Update: 2021-11-01 02:30 GMT
ఎన్నికల మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెన్సీని పెట్టి.. దేశంలో అల‌జ‌డి సృష్టిస్తున్న ఐప్యాక్ అధినేత‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. త‌న ఫీల్డ్‌లో అంటే.. రాజ‌కీయాలు వ్యూహ‌క‌ర్త‌గా.. స‌క్సెస్ అయ్యారు. అయితే.. దీనికి కార‌ణాలు వేరే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చాలా ప్రాంతీయపార్టీల‌కు ప‌నిచేసి.. వారిని అధికారంలోకి వ‌చ్చేలా.. కార‌ణం అయ్యారు అని ప్ర‌శాంత్ కిశోర్ గురించి చెప్పుకొంటారు. అయితే.. ప్ర‌శాంత్ కిశోర్ గురించి తెలిసిన వారు మాత్రం.. ఇది రాంగ్ అంటున్నారు. ఎలా అంటే.. అన్ని రాష్ట్రాల్లోనూ ఆయ‌న త‌న వ్యూహాన్ని అమ‌లు చేయ‌బోర‌ని.. చెబుతున్నారు.

ఏ రాష్ట్రంలో ప‌రిస్థితి బాగుంటే.. ఆ రాష్ట్రంలోకి వెళ్లి.. అక్క‌డ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతున్నారు. అంతేకాదు.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ఏ పార్టీనీ జాకీ పెట్టి లేప‌డు అని.. కేవ‌లం క్ల‌రిక‌ల్ ప‌ని చేసి.. క్రెడిట్ కొట్టేస్తాడ‌ని ఈ మ‌ధ్య భారీ ఎత్తున అనేక మంది అంటున్నారు. ఎందుకంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌ను ప్ర‌శాంత్ కిశోర్ ఏమీ చేయ‌లేక‌పోయారు. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల‌.. పార్టీ వాళ్లు కూడా.. ప్ర‌శాంత్‌ను ర‌మ్ముంటున్నారు. కానీ, ఆయ‌న క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం లేదు. ఎందుకంటే.. ఆమె పార్టీకి కేడ‌ర్ లేదు. ఆమె తెలంగాణ కాదు.

సో.. ష‌ర్మిల ఏదో.. ఆవేశంగా.. అన్న ఏపీ సీఎం జ‌గ‌న్ నుంచి వ‌చ్చింది.. అంతే! సో.. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హించిన ప్ర‌శాంత్ కిశోర‌.. మ‌రో కీల‌క విష‌యం కూడా తెలుసుకున్నారు. ష‌ర్మిల వెంబ‌డి.. నిజ‌మైన తెలంగాణ వాదులు ఎవరూ లేరనే విష‌యాన్ని కూడా ప‌సిగ‌ట్టారు. దీంతో ఏం చేయాలో తెలియ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. తాను వ‌చ్చినా.. తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉండ‌దు. సో.. త‌ను వ‌చ్చి ప్ర‌యోజ‌నం ఏంట‌నేది.. ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహం. అందుకే దీనిపై ఆయ‌న ఏమీ మాట్లాడ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు ప్ర‌శాంత్ కిశోర్‌.. గ‌డిచిన రెండురోజులుగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. పీకే విష‌యం.. కాంగ్రెస్‌లో అల‌జ‌డి సృష్టిస్తోంద‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ భావి అధ్య‌క్షుడు.. భావి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీని త‌క్కువ‌గా చూడడంతోపాటు.. ప్రియాంక గాంధీని ఫ్రంట్ లైన్‌లోని తీసుకురావాల‌ని చెప్పాడంట‌. ఈ విష‌యం పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీసింది. అలా అలా.. ఈ విష‌యం కాస్తా.. సోనియా గంధీకి చేర‌డంతో.. ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది.

అంతేకాకుండా.. బిహార్‌లో పార్టీ బ‌లోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యువ నేత‌ల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. అయితే.. ఇది ప్ర‌శాంత్ కిశోర్‌కు న‌చ్చ‌డం లేదట‌. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో.. పీకే.. బిహార్‌కి ముఖ్య‌మంత్రి కావాలి అని.. ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు  రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌స్తుత సీఎం నితీశ్ కుమార్ వ‌య‌సు అయిపోతోంది. ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో జేడీయూ.. కాంగ్రెస్‌ల‌ను క‌లిపి.. అధికారంలోకి తీసుకువ‌స్తే.. తాను ముఖ్య‌మంత్రి అయ్యేందుకు అవ‌కాశం ఉంద‌ని.. పీకే ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

అదేవిధంగా.. రాబోయే ఎన్నిక‌ల్లో.. కాంగ్రెస్‌కు త‌క్కువ సీట్లు.. వ‌చ్చి.. స్థానిక పార్టీల‌కు ఎక్కువ సీట్లు ఇచ్చి.. అడ్జెస్ట్ చేసే ఆలోచ‌నలో ఉన్నాడ‌ని.. పీకేపై కాంగ్రెస్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనేసీనియ‌ర్ నాయ‌కులు.. విష‌యాన్ని.. సోనియా వ‌ర‌కు తీసుకువెళ్లి.. అత‌నికి అడ్డుక‌ట్ట వేశార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.  ఈ నేప‌థ్యంలోనే.. కాంగ్రెస్‌ను ప్ర‌శాంత్ కిశోర్ ఫుల్లుగా టార్గెట్ చేస్తున్నాడ‌ని.. అంటున్నారు.
Tags:    

Similar News