మనం తెలుసుకోవాలే కానీ మన దేశంలో అత్యంత పవర్ ఫుల్ అయిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. ఇవి వద్దు అంటే పోవు.. కావాలి అంటే రావు. సింపుల్ గా చెప్పాలి అంటే చట్ట పరిధిలో నీది అంటే అది నీది మాత్రమే అవుతుంది. కానీ అదే చట్టంలో ఉన్న దొడ్డి దారులు తెలిస్తే.. నీది కాని దానిని కూడా కొన్ని సార్లు హక్కు అనే పదంతో నీ సొంతం చేసుకోవచ్చు. అందుకే మన రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం సర్ ఐవర్ జెన్నింగ్ పోల్చారు. కామత్ ఏకంగా రాజ్యాంగం ఓ ఐరావతం అని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఒకటే. చట్టంపై పట్టు ఉంటే వాటితో ఆట ఆడుకోవచ్చు. అయితే ఇలాంటి ఆటలు ఎక్కువగా ఆస్తికి సంబంధించిన కేసుల్లోనే జరుగుతాయి. కేవలం వారసత్వంగా వచ్చింది ఆస్తి అని కొందరు అంటే.. సంపాధించుకున్నది మాత్రమే ఆస్తి అని మరొకరు అంటారు.
ఇదిలా ఉంటే మన తాత నుంచి కానీ.. తండ్రి నుంచి కానీ వచ్చిన ఆస్తి మీకు చెందేదే అయినా.. కొన్ని సార్లు అది చెందకపోవచ్చు. లేకపోతే పూర్తి ఆస్తి మీది కాదు అని.. మరోకరికి కూడా ఇందులో వాటా ఉందని.. ఇలా చాలానే ఉంటాయి. అయితే మీ తాత ఆస్తిలో మీ వాటా ఎంత ఉంటుంది? అసలు మీకు ఆస్తి అడిగే హక్కు ఉంటుందా? వచ్చిన ఆస్తి మీకు మాత్రమే వర్తిస్తుందా? లేక ఇంకెవరికి అయినా దానిలో భాగం ఉంటుందా? అనేది ఓ తెలుసుకుందాం.
ఆస్తి సంక్రమణ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆస్తి హక్కు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఆస్తి సాధారణంగా మూడు రకాలుగా వస్తుంది. ఒకటి తాను సంపాదించుకున్న ఆస్తి. రెండు తాత, తండ్రుల నుంచి వచ్చింది. మూడు గిఫ్ట్ గా వచ్చింది. అంటే మీ భార్య తెచ్చింది. దానిలో మీకు పూర్తి హక్కులు ఉండవు. నిజానికి మీరు సంపాదించిన దానిలో మాత్రమే మీకు పూర్తి స్థాయిలో హక్కులు ఉంటుందని చెప్పాలి. మీ తాత లేక తండ్రి నుంచి లభించిన దానిని పూర్వీకుల ఆస్తి అని అంటారు. మీ వంశంలో ఉండే వారి నుంచి వరుసగా నాలుగు తరాలుగా వస్తే అది పూర్వీకుల ఆస్తి అవుతుంది. దీనిపై మీకు కచ్చితంగా హక్కు ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు మీ అమ్మ కడుపులో పడినప్పటి నుంచి కూడా ఆస్తి హక్కు మీకు వస్తుంది. అందుకే కొంత మంది నాకు పుట్టబోయే బిడ్డకు అని లేక పుట్టబోయే మనవడికి అని దస్తావేజులు రాస్తుంటారు.
ముందుగా తండ్రిని తీసుకుంటే.. ఆయన ఆస్తి అంటే ఆయన సంపాదించిన ఆస్తి కేవలం పిల్లలకు, భార్యకు మాత్రమే చెందుతుంది. అది కూడా ఆ వ్యక్తి ఎటువంటి వీలునామా అనేది రాయకుండా చనిపోయినప్పుడు మాత్రమే. అలా కాకుండా కుటుంబానికి చెందకుండా ఏ అనాధాశ్రమానికి గానీ లేక ట్రస్ట్ కు కానీ ఇతర ధార్మిక సంస్థలకు రాసిస్తే అది కుటుంబానికి చెందదు. లేకపోతే చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం.. భార్య, పిల్లలు అంటే కూతురు, కొడుక్కు సమానంగా వస్తుంది. ఎలాంటే అంటే భార్యా ఇద్దరు పిల్లులు ఉంటే మూడు వందల రూపాయిల ఆస్తి అందరికి సమానంగా ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున వస్తుంది.
పూర్వీకుల ఆస్తిలో మాత్రం వేరుంటుంది. తాతా ఆస్తిలో మనవడికి ఎంత వస్తుందో.. మనవరాలికి కూడా అంతే వస్తుంది. అలానే ఆ ఆస్తి మీ తాత సొంతగా సంపాదించింది అయితే మాత్రం ఆయన ఇష్టం. మీకు ఇవ్వాలని చట్టం ఎక్కడా చెప్పడం లేదు. అది అతని అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అదే అతను చనిపోతే మీకు చెందుతుంది. ఎప్పుడు తండ్రి కూడా చనిపోయి ఉంటే. లేకపోతే దానికి వరసుడు మీ నాన్న అవుతారు. ఇంక మీ అమ్మ నుంచి వచ్చేది కూడా పిల్లలిద్దరికీ సమానంగా వస్తుంది.