ఈ యోగిని సన్నీలియోన్ వీరాభిమానట!

Update: 2015-08-07 04:03 GMT

Full View
ప్రతీ ఊరిలోనూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ... దేవుళ్లు చాలామందే ఉన్నారు. ఎవరికి వారే మరో ఆప్షన్ లేకపోతే... తామే దేవుళ్లమని, ఆధ్యాత్మిక గురువులమని, భగవంతుడికి - భక్తుడికి మధ్య వారదులమని ఇలా రకరకాలుగా చెప్పుకుని ఏదోవిదంగా చిన్న దుకాణం (ఆశ్రమం) తెరిచేస్తున్నారు. అతితక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోతున్నారు. ఇలాంటి కోవకు చెందిన మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక యోగిని రాధేమా! నిత్యం కాషాయ వస్త్రాలు, మెడలో రుధ్రాక్షలు, తాళ్లూ వేసుకుని కూర్చునే ఈ యోగిని రాధేమా... ఉన్నట్లుండి ఖరీదైన దుస్తులతో, మెడనిండా దగ దగ నగలతో కనిపిస్తుంది. అంతేనా... మినీ స్కర్ట్స్ వేసుకుని పూనం పాండే తరహాలో ఫోజులు ఇచ్చేస్తోంది! ప్రస్తుతం ఈ చిందుల తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది!

ఈవిడ గారి చిత్ర విచిత్రలాపై ముంబైకి చెందిన ఫల్గుణి బ్రహ్మభట్ అనే మహిళా లాయర్ ఏకదాటిగా విమర్శల వర్షం కుర్పించారు. ఇదే క్రమంలో నిక్కీ గుప్తా అనే రాధేమా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదుతో ఆ యోగినిపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో యోగిని రాధేమాపై లాయర్ ఫల్గుణి తీవ్ర విమర్శలు చేశారు... పోర్న్ స్టార్ సన్నీ లియోనికి వీరాభిమాని ఈ రాధేమా అని... తన శిష్యులను చాలామందిని కౌగిలించుకుంటూ ముద్దులుపెట్టుకుంటూ ఉంటుందని... మతం పేరిట పనికిమాలిన పనులు చేస్తుందని ఆరోపించారు! ఇదే సమయంలో రాధేమాతో తన వ్యక్తిగత సమస్యను కూడా ఫల్గుణి చెప్పుకొచ్చారు. తన పెళ్లికి హాజరయ్యేందుకు ఈ యోగిని పిలిస్తే... సుమారు రూ. 7 లక్షల రూపాయల విలువైన కానుకలు కావాలని డిమాండ్ చేసిందట! మరింత కట్నం కోసం తన భర్త, అత్తమామలను రెచ్చగొట్టి తనను చేదింపులకు గురిచేసిందని నిక్కీ గుప్తా అనే మరో బాదితురాలు బయటకు వచ్చి ఏకంగా కేసు పెట్టింది! ఈ విమర్శలను ఈ ఆధ్యాత్మిక యోగిని రాధేమా యదావిదిగా ఖండించింది.
Tags:    

Similar News