పాకిస్థాన్‌ను కీర్తించమంటారా? అలా చేయలేం.. ముస్లింల నిరసన.. ఎక్కడంటే
ఏమాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే.. భారత్‌లో ఉన్నప్పటికీ.. ముస్లింలు.. పాకిస్థాన్‌ను కీర్తిస్తారనే విమర్శలు ఉన్నాయి. దీనిలో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. తరచుగా ఈ విమర్శలు అయితే.. వస్తుంటాయి. అయితే.. ఇది ఎలా ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌ను కీర్తిస్తూ.. ఉన్న జాతీయ గీతం `జనగణమన` గీతాన్ని తాము ఆలపించలేమని.. పాకిస్థాన్‌ను కీర్తించలేమని ముస్లింలు వ్యతిరేకత తెలిపారు. అంతేకాదు.. ముస్లిం విద్యార్థులు.. ఈ జాతీయ గీతంలో మార్పులు సూచించారు. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న విమర్శలను తోసిపుచ్చేలా వ్యవహరించారు.
ఎక్కడంటే..
బీజేపీ పాలిత.. ఉత్తర్ప్రదేశ్లోని ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలలో తరగతులకు ముందు జాతీయ గీతం ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల నిబంధనను విధించారు. ఈ ఆదేశాలపై గాజీ పుర్లోని ముస్లిం మతపెద్దల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహమ్మదా బాద్కు చెందిన మౌలానా అన్వర్ హుస్సేన్ సిద్ధిఖీ అనే వ్యక్తి.. ఈ ఉత్తర్వులను స్వీకరిస్తూనే సీఎంకు ఓ విన్నపం చేశారు.
``పాకిస్థాన్.... భారత్ కు శత్రుదేశం. జాతీయ గీతంలో `సింధ్` అనే పదం ఉంటుంది. పాక్ తో మన సంబంధాలు చెడిపోయిన వేళ ఆ దేశంలోని సింధ్ ప్రాంతానికి పొగుడుతూ జనగణమన పాడలేము" అని మౌల్వీ సిద్ధిఖీ అన్నారు. సింధ్ పదాన్ని జాతీయగీతాన్ని తొలగించి, ఆ స్థానంలో వేరే పదాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
హిందూ-ముస్లిం, గుడి-మసీద్ లాంటివాటిని మించి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని యోగిని అభ్యర్థించారు మౌల్వీ సిద్ధిఖీ. ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క చుక్క చమట చిందిస్తే.. రాష్ట్రం, దేశం కోసం ముస్లింలు ప్రాణం పెట్టేస్తారని అన్నారు.
యోగి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు ముంతాజ్ అన్సారీ మదర్సా ఆచార్య ఇన్స్ట్రక్షన్ రాష్ట్ర అధ్యక్షుడు. మదర్సాలలో జాతీయ గీతం విధానాన్ని ఆహ్వానించిన ఆయన.. తన చివరి శ్వాస వరకు జనగణమన పాడతానని చెప్పారు. అది దేశ ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, దేశభక్తిని పెంపొందిస్తుందని అన్నారు. మరి... దీనిపై యోగి సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.