చిన్న అనుమానం భయంగా మారి.. అది కాస్తా ఆందోళనగా మారటం మామూలే. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరంలోని వారిలో ఎక్కువగా కనిపిస్తుందా? అంటే అవునని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు.. చేస్తున్న సూచనలు..ముందస్తు జాగ్రత్తలతో పేరుతో జారీ అవుతున్న అనధికారిక హెచ్చరికలు హైదరాబాద్ వాసుల్ని కొత్త కంగారును తీసుకొస్తున్నాయి.
కరోనా వైరస్ అలెర్టులు గడిచిన వారం రోజులుగా వినిపిస్తున్నా.. రెండు.. మూడు రోజులుగా ఈ తీవ్రత మరింత ఎక్కువైంది. అమెరికా.. యూరోపియన్.. మధ్య ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో.. ఆయా దేశాల నుంచి వచ్చిన వారి కారణంగా తెలంగాణలో గడిచిన మూడు.. నాలుగు రోజుల్లో పెరిగిన పాజిటివ్ కేసులు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఈ కారణంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్నికఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం పెరుగుతోంది. నిజానికి.. అనవసరమైన పానిక్ సిట్చ్యూవేషన్ ను చోటు చేసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే విషయాన్ని.. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు. సూపర్ మార్కెట్లు.. కూరగాయల షాపుల్ని మూసివేస్తారా? అన్న ప్రశ్నకు.. బ్లాక్ మార్కెట్ గాళ్లు ఇలాంటి సమయాన్ని వినియోగించుకోవాలని చూస్తారని.. తెలంగాణలో పరిస్థితి అంతా అండర్ కంట్రోల్ గా ఉందన్నారు.
అయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు.. ప్రతి ఒక్కరిలోనూ కొత్త కంగారును తీసుకొస్తున్నాయి. ఎందుకైనా మంచిది.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఏర్పాట్లు లాంటి ఆలోచనలతో నిత్యవసర వస్తువుల కొనుగోలు.. ప్రొక్యూర్ మెంట్ గడిచిన మూడు రోజులుగా భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ లోని సూపర్ మార్కెట్లలో రద్దీ పెరిగింది. కొన్ని సూపర్ మార్కెట్లలో అమ్మకాలు వంద శాతం పెరిగినట్లు చెబుతున్నారు.
అంటే.. పది లక్షలు అమ్మే షాపు కాస్తా.. ఇప్పుడు రూ.20లక్షలు అమ్ముతున్నాయని.. బాగా ఫేమస్ సూపర్ మార్కెట్లలో అమ్మకాల పెరుగుదల ముప్ఫై శాతం నుంచి యాభై శాతం వరకూ పెరిగినట్లుగా విశ్లేషిస్తున్నారు. దీంతో.. కొన్నిచోట్ల నిత్యవసర వస్తువులు (ఆటా.. టెట్రా మిల్క్.. పుటాని) లాంటి వాటి విషయంలో కొంత కొరత ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. తమ వద్ద స్టాక్ అయిపోయిన వెంటనే.. గౌడన్ నుంచి తీసుకొస్తుననారు.
ఈ కారణంగా కొన్ని వస్తువులకు ఏర్పడుతున్న కొరత కొన్ని గంటలే తప్పించి ఎక్కువ సేపు ఉండటం లేదు. కాకుంటే.. ఇదే తరహాలో మరో పది రోజులు కానీ అమ్మకాలు సాగితే మాత్రం.. కొరత మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన స్టాక్ వస్తుంటే ఇబ్బంది ఉండదంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఆగితే తప్పించి.. హైదరాబాద్ మహా నగరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు.