కరోనా ప్రమాదం తెలంగాణలో ఎంతన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. సెన్సెక్స్ మాదిరి తెలంగాణలో కరోనాపై భయాందోళనలు రోజుకో తీరులో మారిపోతోంది. మంగళవారం ఒక మోస్తరుగా ఉన్న కరోనా భయం... బుధవారం పీక్స్ కు వెళితే... గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసు అధికారికంగా అనౌన్స్ చేయటం... ఆ బాటలో మరో ముగ్గురున్నారంటూ మీడియాలోని కొన్ని సెక్షన్లు... సోషల్ మీడియాలో మరికొంత హడావుడితో... సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇలాంటివేళ... అనుమానంగా ఉన్న ఇద్దరికి కరోనా లేదన్న రిపోర్టు రావటం... దాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల అధికారికంగా ప్రకటించటంతో అప్పటివరకూ బెంగతో ఉన్న వారంతా హాయిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. చిన్న చిన్న కారణాలకే విపరీతంగా స్పందించే సెన్సెక్స్ కు తగ్గట్లే... కరోనాకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రజలు.. మరి ముఖ్యంగా హైదరాబాదీయులు వణికిపోతున్నారు.
అవగాహన కంటే అపోహలే ఎక్కువగా వైరల్ కావటంతో జనాల్లో భయాందోళనలు అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి తోడు మైండ్ స్పేస్ లోని ఒకట్రెండు ఐటీ కంపెనీలు చేసిన పని.. ప్రశాంతంగా ఉన్న వారిలోనూ టెన్షన్ పుట్టించిన వైనాన్ని మర్చిపోకూడదు. గడిచిన మూడు రోజుల్లో కరోనాపై భయాందోళనల్లో మూడు షేడ్స్ కనిపించాయి. రానున్న రోజుల్లో మరెన్ని షేడ్స్ బయటకు వస్తాయో చూడాలి. ఏమైనా.. ఎవరికి వారు కరోనా గురించి పడే భయం కంటే.. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల్ని పాటిస్తే మంచిదన్నది మర్చిపోకూడదు.