కాలేజీల్లో కరోనా కల్లోలం.. విద్యార్థులకు వైరస్

Update: 2021-03-21 04:00 GMT
తెలంగాణలో మరోసారి కరోనా కోరలు చాచింది. కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. వరుసగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో , వసతి గృహాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ పాఠశాలతోపాటు కళాశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులను పిలిపించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ కోరారు. హయత్ నగర్ కాలేజీ హాస్టల్ లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే పున: ప్రారంభం తర్వాత కరోనా వైరస్ ప్రబలుతుండడంతో అధికార వర్గాలు,తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడం.. విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించడంతో మరోసారి స్కూల్స్, కాలేజీలను బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News