కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన విశ్వరూపం చూపిస్తోంది. గతేడాది నుంచి వైరస్ విజృంస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం, చిన్న దేశాల్లోనూ కరోనా ప్రభావం చూపింది. ఇక 2021లో దాదాపు అన్ని ఉత్పత్తులు మూతపడ్డాయి. వివిధ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. కేవలం అత్యవసరం మినహా అన్ని రంగాలు తమ సేవలను రద్దు చేశారు. ఇక కరోనా ప్రభావం షాపింగ్ మాల్స్ పై ఎక్కువగా చూపింది.
కరోనా కారణంగా గతేడాది షాపింగ్ మాల్స్ ను మూసేశారు. తొలి ఆరు నెలల్లో పూర్తిగా మూసేయడం వల్ల మాల్స్ ఆదాయం 45 శాతం క్షీణించిందని ఓ సర్వే వెల్లడించింది. ఆ తర్వాత 2022 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మాత్రం పుంజుకుంటాయని అంచనా వేసింది. 45-55 శాతం మేర వృద్దిరేటు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఎంత ఆదాయం పెరిగినా కరోనా ముందు ఉన్న ఆదాయానికి చేరుకోలేదని స్పష్టం చేసింది. దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ, ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగాలు 70 శాతం కోలుకున్నాయని తెలిపింది. సినిమా, వినోదాత్మక రంగాలు ఇంకా క్షీణ దశలోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. సెకండ్ వేవ్ కారణంగా మాల్స్ పై తీవ్రంగా ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. రిటైల్ అమ్మకాల మీద ఎక్కువగా ప్రతికూలత చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది అమ్మకాలు కోలుకోని కొవిడ్ ముందు ఆదాయంలో 90 శాతానికి చేరుతాయని వివరించింది. కానీ రెండో దశ కారణంగా దానిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యజమానుల అద్దె ఆదాయం మీద ప్రభావం తగ్గే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
మాల్స్ ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో ఈ ప్రభావం ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే స్వల్ప లాక్ డౌన్ నియమాలను అమలు చేస్తున్నారు. ఫలితంగా షాపింగ్ మాల్స్ ఆదాయం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. దేశంలో మాల్స్ ఆదాయంలో 35-45శాతం మహారాష్ట్ర నుంచే సమకూరుతుంది. అలాంటిది ఆ రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మాల్స్ ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.