కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఏడాది నుంచి వైరస్ జడలు చాస్తోంది. ఎంతో మంది దీని నుంచి విముక్తి పొందగా... మరికొంత మంది తనువు చాలించారు. ఇక రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల ప్రజలు అప్రమత్తమవుతున్నారు. సాధ్యమైనంత వరకు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఇకపోతే వైరస్ మ్యూటేట్ అవడం వల్ల లక్షణాలు మారుతూ వస్తున్నాయి.
వైరస్ తొలి కేసుల్లో తీవ్రమైన జ్వరం, జలుబు, పొడి దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉండేవి. రెండో దశకో మరికొన్ని లక్షణాలను గుర్తించారు. కరోనా గొంతు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ప్రభావం చూపుతుంది. ఫలితంగా శ్వాస వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. అలా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తించగలిగితే ప్రమాదం కాస్త తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలిగితే వెంటనే అప్రమత్తమవ్వాలని చెబుతున్నారు. ఊపిరితిత్తుల కింది భాగంలో వాపు, నొప్పి వంటివి ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అలసత్వం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకోవడంలో భాగంగా ఊపిరితిత్తులు 25 శాతం పాడవుతాయని అంటున్నారు. కొందరికి ఈ సమస్య తీవ్రమై పూర్తిగా పాడవుతాయని చెబుతున్నారు. ఫలితంగా ప్రాణాలు పోతున్నాయని అన్నారు.
శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి... పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. ఊపిరితిత్తుల పనితీరు బాగుంటే శ్వాస వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. ఇక వీటిని రక్షించుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. ఫలితంగా సంకోచ, వ్యాకోచాలు పెరిగి ఊపిరి తీసుకోవడం సులభం అవుతుందని అన్నారు. ఈ కరోనా విపత్కర కాలంలో మంచి ఆహారం తీసుకుంటూ... వ్యాయామం చేయాలని తెలిపారు.