తెలంగాణ, ఏపీల్లో కరోనా కలకలం మొదలైంది. ఒక్కరోజులోనే 24 గంటల్లో ప్రశాంతంగా ఉన్న ఏపీలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో బుధవారం కొత్తగా 30 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 127కు చేరింది. ఏపీలో 111కు కరోనా కేసులు చేరాయి.
ఢిల్లీ వెళ్లి మర్కాజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో సోమవారం కరోనాతో ఐదుగురు తెలంగాణలో మరణించారు. బుధవారం దాదాపు 500 మంది సమాచారం సేకరించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు.. వారితో సంబంధం పెట్టుకున్న వారిలో చాలా మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. చార్మినార్ నిజామియా ఆస్పత్రిలో 80మందిని, హైదరాబాద్ అమీర్ పేటలో 200 మందిని, సరోజినీదేవీ ఆస్పత్రిలో 110 మందిని చేర్చారు. ఇంకా ఢిల్లీ వెళ్లి వచ్చిన 160 మంది జాడ కోసం తెలంగాణ అధికారులు శోదిస్తున్నారు. వారి జాడ దొరకడం లేదట..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత ఆందోళన కలిగించేలా ఉంది. 24 గంటల్లో రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య ఏపీలో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు తాజా సానుకూల కేసులు లేవని, ఉదయం నుంచి పరీక్షించిన అన్ని నమూనాలు ప్రతికూలంగా ఉన్నాయని ఒక సాయంత్రం బులెటిన్ తెలిపింది. ఏపీ ప్రభుత్వం రాత్రి 10 గంటల బులెటిన్ ప్రకారం, మరో 24 కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం సానుకూల కేసుల సంఖ్య 111 కు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రం వరకు నమోదైన 87 పాజిటివ్ కేసుల్లో 70 కేసులు ఢిల్లీలోని మార్కాజ్ నుంచి తిరిగి వచ్చిన వారు వారి పరిచయస్తులేనని తెలిపారు..
ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ ప్రార్థన సమావేశానికి హాజరయ్యారు. 585 నమూనాలను తీసుకున్నామని.. ఇందులో 70 మంది పాజిటివ్ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు. 500 ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. 21 మందిని ఇంకా గుర్తించలేదని సీఎం జగన్ తెలిపారు.