కరోనా జన్మస్థానం చైనాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రబలడం మొదలుపెట్టిందట. చైనాలోని హుబె ప్రావిన్స్ కు చెందిన వూహాన్ లో కరోనా మహమ్మారి ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. ఈ వైరస్ ఎంత ప్రమాదకారో అర్థమైన వెంటనే.. చైనా అంటమేల్కొంది. కరోనా వ్యాధిగ్రస్తులకు వూహాన్ లోనే ప్రత్యేకంగా ఆసుపత్రులను హుటాహుటీన నిర్మించింది. కరోనా వైరస్ బారిన పడిన వారిని సదరు ఆసుపత్రులకు తరలించి... అక్కడే నియమించిన వైద్యులతో సమగ్ర చికిత్సలు అందించింది. తమ వైద్యుల చికిత్సలు ఫలించి కరోనా బారిన పడిన వారంతా కోలుకున్నారని - ఈ నేపథ్యంలో కరోనాను తాము కంట్రోల్ చేశామంటూ చైనా ఘనంగానే ప్రకటించింది.
ఈ విషయాన్ని ఘనంగానే ప్రకటించిన చైనా.. వూహాన్ లోని కరోనా ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బంది. రోగులు అక్కడి నుంచి విజయదరహాసంతో వస్తున్న ఫొటోలను కూడా ప్రచురించింది. అయితే ఇదంతా కొద్ది రోజులేనని తేలిపోయింది. కరోనా వైరస్ బారిన పడి దాని నుంచి కోలుకున్న రోగుల్లో కొందరికి మళ్లీ జలుబు - జ్వరం తిరగబెట్టాయట. అంటే.. కరోనా వైరస్ సదరు రోగుల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించండం మొదలెట్టిందన్న మాట. ఇలా కరోనా వైరస్ సోకి దాని నుంచి బయటపడి తిరిగి దానితో ఇబ్బంది పడుతున్న వారి శాతం 14గా ఉన్నట్లుగా తేలిందని దక్షిణ చైనాలోని పత్రిక ‘మార్నింగ్ పోస్ట్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
మొత్తంగా చైనాకు ఇప్పుడు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు పుట్టినిల్లుగా అప్రతిష్ట మూటగట్టుకున్న చైనా... దానిని కంట్రోల్ చేశామన్న సంతోషాన్ని కొద్ది రోజుల్లోనే కోల్పోవాల్సి వచ్చిందట. అయితే ఇలా కరోనా బారిన పడి తిరిగి మళ్లీ దాని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న కేసులు ప్రస్తుతం వూహాన్ పరిసర ప్రాంతాలకే పరిమితం కాగా... మిగతా ప్రాంతాల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉన్నట్టుగా మార్నింగ్ పోస్ట్ బాంబులాంటి వార్తను ప్రచురించింది. మరి ఈ తరహా పరిస్థితిని చైనా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.