నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ప్రపంచస్థాయిలో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించే సీఆర్‌డీఏ కార్యాలయంతోనే దీనిని ప్రారంభించారు. కళ్లు చెదిరే ఇంటీరియర్, సెంట్రలైజ్డ్ ఏసీ, అత్యాధునిక ఫర్నిచర్‌లతో సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాన్ని తయారు చేస్తున్నారు. రాజధానికి దీనిని నిదర్శనంగా చూపనున్నారు.
సీఆర్‌డీఏ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్తుల్లో సీఆర్‌డీఏ భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్రంట్ ఆఫీస్, సమావేశ మందిరాలు, శిక్షణ కేంద్రాలు, వర్క్ స్టేషన్లు, అధికారుల చాంబర్లు ఉంటాయి. సందర్శకులు వేచి ఉండేందుకు వెయిటింగ్ హాల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక మొదటి అంతస్తులో సీఆర్‌డీఏ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, డైరెక్టర్ల చాంబర్లతోపాటు ఇతర విభాగాలు ఉంటాయి. మూడో అంతస్తులో అధునాతన ఫలహార శాలను ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం అన్ని అంతస్తుల్లోనూ అధునాతన టెక్నాలజీ, అత్యాధునిక బల్లలు, కుర్చీలు, సెంట్రలైజ్డ్ ఏసీ, వైఫై, ప్రపంచస్థాయి ఇంటీరియర్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో రాజధానిలో జరిగే నిర్మాణాలకు సీఆర్‌డీఏ కార్యాలయం ఒక సంకేతంగా ఉంటుందని చెబుతున్నారు.