క్రికెటర్ అశ్విన్ భార్య ట్వీట్.. తెగ వైరల్ అవుతున్న పోస్ట్.. అందులో ఏముందో తెలుసా?
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 482 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 317 పరుగుల తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది.
అయితే.. ఈ విజయంలో స్పిన్నర్ అశ్విన్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డివిరిచిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాకుండా.. బ్యాట్ తోనూ సత్తా చాటాడు అశ్విన్. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ బాదేసి, ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
అయితే.. ఈ సమయంలో అశ్విన్ భార్య చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. తమిళ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఆ మూవీలోని ఓ పోస్టర్‌ను ఎవరో మార్ఫింగ్ చేశారు. పక్కన ఉన్న వారంతా ముందుకు వెళ్తుండగా.. విజయ్ మాత్రం వెనక్కి తిరిగి ‘ష్.... సైలెన్స్’ అన్నట్టుగా వేలు చూపిస్తుంటాడు.
ఆ పోస్టర్ లో విజయ్ ఫేస్ ను ఎవరో ఎడిట్ చేసి, అశ్విన్ ఫేస్ తగిలించారు. ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన ప్రీతి.. ‘ఇలా ఎవరు చేశారు’ అంటూ ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేసింది. ఈ హ్యాపీ మూమెంట్ లో అశ్విన్ హీరోను చేయడంతో హ్యాపీగా ఫీలవుతోంది అశ్విన్ వైఫ్. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.