ప్రపంచంలోనే గన్ కల్చర్ కు పెట్టింది పేరు అమెరికా.. ఆ దేశంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట గన్ పేలుతూనే ఉంటుంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. తుపాకులు విరివిగా అమెరికాలో దొరుకుతాయి. అందరూ కొని ఇంట్లో పెట్టుకుంటారు. మనలాగా స్టిక్ట్ ఆంక్షలు అక్కడ లేవు. సో ప్రతీసారి ఎవ్వరికి మండినా వీధుల్లోకి , కార్యాలయాలు, మార్కెట్లోకి వెళ్లి కాల్చేస్తారు.
ప్రస్తుతం తుపాకీ హింసను బట్టి ప్రపంచంలోని అత్యంత హింసాత్మక దేశాలలో ఒకటిగా అమెరికా ఉంది. అమెరికాలో తుపాకీ హింస , సామూహిక కాల్పులు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి. ఒకే సంఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామూహిక కాల్పులతో హత్యలు, ఆత్మహత్యలు , ప్రమాదవశాత్తు కాల్పులతోనూ ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది.
తుపాకీ సంబంధిత హింసలో అధిక రేటును అమెరికాలో ఉంది. అయితే గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచ నేరాల ర్యాంకింగ్‌లో అమెరికా ఆశ్చర్యకరంగా 55వ స్థానంలో నిలవడం విశేషం. యూకే తర్వాత భారతదేశం స్థానం నిలిచింది.
క్రైం రేటు జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు చూస్తే.. మొట్టమొదటి స్థానంలో వెనిజులా ఉంది. తర్వాతి స్థానంలో పాపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, హోండురాస్, ట్రినిడాడ్, గయానా, సిరియా, సోమాలియా , జమైకా ఉన్నాయి. ఈ దేశంలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండటం వల్ల దోపిడీ , దాడి వంటి ఇతర రకాల నేరాలు ఎక్కువగా అవుతున్నట్టు తేలింది..
ఈ నేరాలను నేరాల సంఖ్య మొత్తం జనాభాతో భాగించబడుతుంది. తర్వాత 100,000 గుణించబడుతుంది. నేరాల రేటు 1 లక్ష మంది వ్యక్తులకు నేరాల సంఖ్యతో పోల్చి మొత్తం నేరాల రేటును వెల్లడిస్తారు. భారతదేశం ఎక్కడో మధ్యలో ఉంది. టాప్ 10 లో కూడా లేదు. ఇండియా రెడ్ జోన్‌లో లేనప్పటికీ, అది ఖచ్చితంగా ప్రశంసనీయమైన స్థితిలో అయితే లేదు.