నారా లోకేష్ పై క్రిమినల్ కేసు

Update: 2021-05-08 15:31 GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మీద‌ అసత్యాలు ప్ర‌చారం చేశార‌నే అభియోగంపై పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగిన గొడ‌వ‌ను ఎమ్మెల్యేకు అంట‌గ‌ట్ట‌డ‌మే కాకుండా.. ఆయ‌న‌కు వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశార‌ని వైసీపీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌ల్లో ఎమ్మెల్యే వ్య‌తిరేక‌త వ‌చ్చేలా, ద్వేషం క‌లిగించేలా కుట్ర‌చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టుగా తెలుస్తోంది. దీంతో.. ఐపీసీ 153ఏ, 505, 506 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ వివాదానికి కార‌ణం ఏమంటే.. ఏప్రిల్ 21న అనంత‌పురం జిల్లా రాయ‌ద‌ర్గానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌పై క‌ర్నాట‌కలోని బ‌ళ్లారి జిల్లా రాంపురం వ‌ద్ద గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడిచేశార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న నారా లోకేష్‌.. ఇది ఎమ్మెల్యే చేయించిన ప‌ని అని ఆరోపించారు.

సోష‌ల్ మీడియాలో ఎమ్మెల్యే అవినీతిని ప్ర‌శ్నిస్తూ పోస్టులు చేసినందుకే త‌మ కార్య‌క‌ర్త‌పై దాడిచేయించార‌ని లోకేష్ ఆరోపించిన‌ట్టు స‌మాచారం. దీంతో.. ఎమ్మెల్యేపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని వైసీపీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. స్వీక‌రించిన పోలీసులు పై సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News