ఒక్కసారిగా పెద్దఎత్తున మరణిస్తున్న కాకులు..అసలు కారణమేంటంటే?

Update: 2020-04-06 10:10 GMT
కొన్ని సార్లు మూగ పక్షుల మరణం ప్రతి ఒక్కరిని ఎంతగానో కలచివేస్తుంది. అసలు అంత దారుణంగా ఎలా మరణిస్తున్నాయి? అనే అనుమానం కలుగుతుంది.ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే కలుగుతుంది.తాజాగా తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో ఎందుకు మరణిస్తున్నాయి అనే కారణాన్ని కనుక్కోవడం కోసం ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..పనపాక్కం సమీపంలో గత 1వ తేది సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కులత్తుమేడు ప్రాంతంలో అకస్మాత్తుగా పదికి పైగా కాకులు మృతి చెందాయి. దీన్ని గమనించిన ఆ ప్రాంత ప్రజలు కరోనా నేపథ్యం లో 144 సెక్షన్‌ అమలు లో ఉండడం తో ప్రజలు ఎవరూ బయటకు రాక పోవడంతో ఆహారం లేక కాకులు చనిపోయి ఉండవచ్చని  అనుకున్నారు. దీనితో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ,  తర్వాత రోజు సాయంత్రం అదే ప్రాంతం లో ఉన్న ప్రజలు నివాస గృహాలపై నీరసంగా వాలిన కాకులు, అకస్మాత్తుగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దసంఖ్యలో మృతి చెందాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇవి ఆకలి తో చనిపోతున్నాయా లేదా వ్యాధి బారిన పడి చనిపోతున్నాయా అనే విషయం పై స్పష్టత రావడం లేదు.  మరి ఆరోగ్యశాఖ అధికారులు ఈ కాకుల మరణం వెనుక రహస్యాన్ని కనుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News