చెన్నై సూపర్ కింగ్స్ మరో అపజయాన్ని మూటగట్టుకుంది. గత మ్యాచ్ లో సూపర్ ఓవర్ దాకా వచ్చి ఓడిన చెన్నై ఈసారి స్వల్ప స్కోరు కే పరిమితం అయ్యి ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో చెన్నై ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లాయి. అబుదాబి వేదికగా జరిగిన ఐపీ ఎల్ మ్యాచ్ లో చెన్నై జట్టుపై రాజస్థాన్ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ 17.6 ఓవర్ల లోనే మ్యాచ్ గెలిచేసింది. విజయం లో జాస్ బట్లర్(69) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టులో రవీంద్ర జడేజా (35*; 30 బంతుల్లో 4x4) మాత్రమే ఓ మోస్తరు పరుగులు సాధించాడు. కెప్టెన్ ధోనీ (28; 28 బంతుల్లో 2x4), ఓపెనర్ సామ్‌కరన్ (22; 25 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు.
రాజస్థాన్ బౌలర్లు చెలరేగి ఆడటంతో చెన్నై బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ ధాటిగా ఆడలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూవచ్చారు. డుప్లెసిస్ (10), షేన్ వాట్సన్ (8) ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడు (13) విఫలం అయ్యారు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టోర్నీలో చెన్నైకి ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ బట్లర్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.మిగతా బ్యాట్స్‌మెన్ స్మిత్(26), స్టోక్స్(19) పర్వాలేదనిపించారు. చెన్నై విధించిన లక్ష్యాన్ని 17.6 ఓవర్లలోనే రాజస్థాన్ అందుకుంది.రాజస్థాన్ కీలక విజయంతో ఫ్లేఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్(2), హేజిల్‌వుడ్ ఒక్క వికెట్ తీశాడు.
చెన్నై కి ప్లేఆఫ్ ఇక కష్టమే
పది మ్యాచ్ లు ఆడిన చెన్నై 3 విజయాలే సాధించగా 7 మ్యాచ్ లలో ఓటమి చెందింది.
మిగతా నాలుగు మ్యాచ్‌లూ గెలిచినా ఏదైనా అద్భుతం జరిగితేనే చెన్నై ప్లేఆఫ్ చేరుకుంటుంది.చెన్నై తర్వాతి మ్యాచ్ లు వరుసగా ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, పంజాబ్‌లతో ఆడాలి. అన్ని జట్లను ఓడించడం అంత తేలిక కాదు. నెట్ రన్‌రేట్ లోనూ చెన్నై మిగతా జట్లకంటే వెనుకబడి ఉంది. దీంతో చెన్నై ప్లేఆఫ్ అసలు సంక్లిష్టంగా మారాయి. లీగ్ లో ఆడిన ప్రతిసారీ సెమీస్/ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుగా రికార్డు కలిగి ఉన్న ధోని జట్టు.. ఈసారి మాత్రం తొలి దశలో నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.