కడప రిమ్స్ సందర్శనలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానినేని శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా కలెక్టరు కేవీ సత్యనారాయణ సైతం నోరుపారేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. 'ఎవర్రా మీరు.. మీకేం పని పన్రా ఇక్కడ' అంటూ కలెక్టర్ తమను విమర్శించారని, పనికి రాని నా..ళ్లంటూ మంత్రి బూతులు అందుకున్నారని రిమ్స్ ఔట్ సోర్సింగ్ కార్మికులు - వారి వెంట వెళ్లిన వామపక్ష సంఘాల నేతలు ఆరోపించారు.
కడప జిల్లాలోని రిమ్స్ వైద్యశాలను పరిశీలించడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని సీఐటీయూ నాయకులు తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా సీఐటీయూ నాయకులు వారికి సమస్యలను వివరిస్తూ రిమ్స్ లో దాదాపు 150 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదని, సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని కోరారు. దీంతో మంత్రి ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలకు తమకేమి సంబంధం అంటూ సమాధానమిచ్చారు. తాము పనిచేస్తుంది ప్రభుత్వాసుపత్రిలోనేనని తమ సమస్యలపై స్పందించాలని కోరగా మంత్రి అసహనంతో గుడ్లురుముతూ వినతిపత్రాన్ని చించడానికి ప్రయత్నించారని, మీడియా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారని వారు తెలిపారు. ఇంతలో కలెక్టరు కలుగజేసుకొని 'ఎవర్రా మీరు..?.. ఏం పనిరా ఇక్కడ..?'. అంటూ నోరుపారేసుకున్నారు. గౌరవంగా మాట్లాడండి అని నాయకులు అనడంతో పక్కనున్న పోలీసులను 'వీళ్లను ఈడ్చేయండి' అంటూ కలెక్టర్ ఆదేశించారు. ఇంతలో సీఐటీయూ జిల్లా నాయకుడొకరు ఇదేమిటని ప్రశ్నిస్తే 'నీవెవడ్రా.. యూజ్ లెస్ ఫెలో' అంటూ దూషించాడు. 'పనికిరాని నా..ళ్లు' అంటూ మంత్రి నోరుపారేసుకున్నారని సీఐటీయూ నేతలు పేర్కొన్నారు. మంత్రి - కలెక్టర్ తీరుతో తాము మనోవేధనకు గురయ్యామని, దీంతో జిల్లా బంద్ కు పిలుపునిచ్చామని వారు వివరించారు.