ఈ ప్రపంచం అనేక అద్భుతాలకు నెలవు. మనకు తెలిసినవి ఒకటి రెండు ఉంటే తెలియనివి బోలెడు ఉంటాయి. ప్రాంతం మారే కొద్ది భాష మారుతుంది. దీనితో పాటే ఆచార వ్యవహారాలు, పద్ధతులు, విధానాలు ఇలా చాలా మారుతాయి. బయటవారికి మన పద్దతులు వింతగా ఉంటాయి. అలానే ఇతరులు చేసే వాటిని చూసి ఛీ ఏంటి ఈ రోత అని అనుకుంటూ ఉంటాం.
అయితే ఇండోనేసియాలో అలాంటి పద్ధతే ఒకటి ఉంది. అక్కడి ఉండే ప్రజలు చనిపోయిన తరువాత బాడీని ఇంట్లోనే ఉంచుకుంటారంట. మనిషి చనిపోయిన 24 గంటలు తిరగకుండానే కాల్చి వేయడం కానీ, పూడ్చి పెట్టడం కానీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం అలా కాదంట. శవాలతో సహజీవనం చేస్తున్నారు.
అంతేగాకుడా వాటికి ప్రతీ రోజు స్నానం చేయిస్తున్నారు. అంతేగాకుండా భోజనం కూడా పెడతున్నారు. ఇదెక్కడి సంప్రదాయంరా బాబు అని అనుకుంటున్నారా నిజం. దీని వింత సంప్రదాయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇండోనేసియా లోని సౌత్ సులవేసిలో ఉండే ఓ కొండ జాతి ప్రజలు పైన చెప్పిన విధంగా శవాలతో సహజీవనం చేస్తున్నారు. దాని పేరే టొరాజా. అందరి కంటే వీరి ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి.
ఇంట్లో ఎవరైన ఓ వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులు అతని అంత్య క్రియలు నిర్వహించరు. ఆ బాడీని ఇంట్లోనే ఉంచుకుంటారు. రోజు వారీగా పనులు ఎలా చేస్తారో అలానే వారితో కలిసి ఉంటారు.
ఆ చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించడం, మంచి బట్టలు వేయడం, సమయానికి భోజనం పెట్టడం, అలానే గాలి ఆడకపోతే ఆ మృత దేహానికి ఫ్యాన్ కూడా వేస్తారు. మరి కొంచెం డబ్బుున్న వారు అయితే ఏసీ కూడా వేస్తారు.
ఆ జాతి ప్రజలు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. మరణించిన వ్యక్తులు చనిపోలేదని వారు భావిస్తుంటారు. అది వారి నమ్మకం. వారి దృష్టిలో కేవలం అనారోగ్యానికి గురైనట్లు మాత్రమే. అందుకే ఇంట్లోనే పెట్టుకుంటారు.
అంతేగాకుండా ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు కూడా వేస్తారు. ఇంట్లో ఉన్న శవాలతో మంచిగా ఉండే విధానాన్ని పిల్లలకు కూడా అలవాటు చేస్తారు.
ఇదిలా ఉంటే ఇంట్లో ఉండే శవం కుళ్లి పోకుండా.. దానికి సంబంధించిన పసర్లు పూస్తారు. అడవుల్లో దొరికే మందును రాస్తారు. అయితే చివరగా ఇక్కడ ఇంకో ఘట్టం కూడా ఉంది.
అదే అంత్యక్రియలు. ఇవి చేయడానికి చాలా రోజులు పడుతుంది. వారు చనిపోయిన వ్యక్తి కచ్చితంగా మరణించారు అని భావిస్తే అప్పుడు నిర్వహిస్తారు. లేదంటే ఎన్నిరోజులు అయిన ఇంట్లోనే ఉంచుకుంటారు.