ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. జిల్లాల వారీ టైమింగ్స్ ఇవే

Update: 2021-06-30 16:24 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. దాదాపు రెండున్నర నెలలుగా వివిధ దశల్లో లాక్ డౌన్ మాదిరిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండడంతో ప్రభుత్వం సడలింపులు ఇచ్చుకుంటూ వస్తోంది.

ఈ క్రమంలోనే జూన్ 21 నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూ అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 ఇక ఏపీలో సడలించిన కర్ఫ్యూ ఆంక్షలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న 8 జిల్లాలైన అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం,  విజయనగరంలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయంపు ఉంది. ఈ జిల్లాల్లో వ్యాపారసంస్థలు , రెస్టారెంట్లు రాత్రి 8 గంటల వరకే పనిచేస్తాయి.

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి , కృష్ణా , చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకే మినహాయింపు ఉంది. జూలై 7 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.ప్రభుత్వ తాజా ఉత్తర్వులు జూలై 1 నుంచి 7వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న పాజిటివిటీ రేటు ఆధారంగా కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకుంటారు.
Tags:    

Similar News