చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్ వచ్చిన చాలా మందికి కరోనా వైరస్ అని తేలింది. సౌదీ అరేబియా దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఒక్కరోజే సౌదీలో ఏకంగా 119 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం 51 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సౌదీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 562కు పెరిగింది. ఈ నేపథ్యంలో సౌదీ రాజు సల్మాన్ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ కర్ఫ్యూ సౌదీ దేశంలో అమల్లోకి వచ్చింది.
మార్చి 23 నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 21 రోజుల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.ఈ 11 గంటల కర్ఫ్యూలో ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
కర్ఫ్యూ ఉల్లంఘించిన వారికి 10వేల రియాల్స్ (2 లక్షల 2వేలు) జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ కర్ఫ్యూ నుంచి వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సెక్యూరిటీ, మిలిటరీ అధికారులకు మినహాయింపునిచ్చారు. ఈ కర్ఫ్యూ సమయంలో దేశ పౌరులతోపాటు ప్రవాసులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు.