కరెన్సీ నోట్లకు అనంత జిల్లాకు లింకు ఈ మధ్యన పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో ఆ జిల్లా పేరుతో కరెన్సీ నోట్ల ఉదంతాలు రెండు..మూడుచోటు చేసుకున్నాయి. ఏపీకి చెందిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా నగదులభించటం ఒకటైతే.. ఇటీవల అనంతపురం బస్టాండ్ లో రూ.10లక్షల నగదుతో ఉన్న ఒక బ్యాగును పోలీసులు గుర్తించటం తెలిసిందే.
ఈ రెండు ఉదంతాలకు భిన్నమైన పరిస్థితి తాజాగా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అనంత జిల్లాలోని రాయదుర్గం మండలంలోని జాతీయ రహదారిపై రూ.500 నోట్లు భారీగా పడి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న స్థానికులు.. పెద్ద ఎత్తున చేరుకొని.. ఎవరికి దొరికినంత వారు ఏరేసుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. రోడ్ల మీద పడిన నోట్లు అన్ని రూ.500 నోట్లేనని చెబుతున్నారు. కరెన్సీ నోట్ల భారీగా రోడ్డు మీద పడి ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్న బొమ్మకపల్లి.. 74 ఉడేగోళం గ్రామస్తులు ఎగబడి మరీ ఏరుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ నోట్ల విలువ దాదాపు రూ.10లక్షల వరకు ఉండొచ్చన్న అంచనా వినిపిస్తోంది. రోడ్ల మీద నోట్ల కట్టల సమాచారాన్ని అందుకున్న రాయదుర్గం పోలీసులు.. అసలేం జరిగిందన్న సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు స్థానిక పోలీసులు. ఇంతకీ ఈ నోట్లు రోడ్డు మీద ఎందుకు పడ్డాయి? దీని వెనుక ఎవరున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నోట్లు ఏరుకున్నట్లుగా చెబుతున్న ప్రజలు ఇప్పుడు గమ్మున ఉండటం ఈ మొత్తం ఎపిసోడ్ కు అసలు ట్విస్టుగా చెబుతున్నారు.