లాక్ డౌన్ తో జనమంతా లాక్ చేయబడి ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. అయితే ఈ ఇళ్లలోని జనాలను కూడా కొందరు వదలడం లేదు. కొంత మంది సైబర్ మోసగాళ్లు, కరోనా బారిన పడకుండా ఈ లింక్ ను క్లియ్ చేయండని.. ఇలా చేస్తే కరోనా రాదని మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ లు పంపిస్తూ వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును స్వాహా చేసే పనికి తెగబడ్డారు.
కరోనా పాజిటివ్ టెస్టులు చేస్తాం.. ఈ లక్షణాలుంటే తమను సంప్రదించాలని కొందరు టెక్ట్స్ మెసేజ్ లు పంపుతున్నారు. ఈ మేసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ బ్యాంకు, లేదా ఇతర రహస్య వివరాలను కొల్లగొట్టడానికే ఇలా మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని.. లింకులపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇప్పటికే అమెరికాలో చాలా మంది కరోనా అనుమానితులకు ఈ మెసేజ్ లు వెళ్లాయి. వారు నమ్మి తమ వ్యక్తిగత వివరాలు - బ్యాంకు లాగిన్లు - సామాజిక భద్రత పాస్ వర్డులు పోగొట్టుకొని డబ్బులు కోల్పోయారు. ఈ స్కామ్ కాల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మీకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిందని బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని చెప్పగానే చాలా మంది ఇచ్చేశారట.. వారి సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేశారు. సో మీకూ అలాంటి మెసేజ్ లు, కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.