పంథా మార్చుతున్న సైబర్ నేరగాళ్లు .. డేటింగ్ అంటూ దొబ్బేస్తున్నారు !

Update: 2020-09-16 06:00 GMT
సైబర్ నేరగాళ్లు రోజుకొక విధంగా అమాయక ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. పోలీసులు ఎంతగా సైబర్ మోసగాళ్లపై దృష్టి పెడుతున్నా కూడా రోజుకో పంథాలో పోతూ తమ పని సజావుగా సాగేలా చూస్తున్నారు. వీరి వలలో సామాన్యులతో పాటుగా రాజకీయ ప్రముఖులు , ఎమ్మెల్యేలు ,ఎంపీలు కూడా పడుతుండటం గమనార్హం. అయితే , ఈ తరహా మోసాలపై ఇప్పుడు అందరిలో కొంత అవగాహన ఉండటంతో .. అబ్బాయిలకు అందమైన యువతులతో మీటింగ్, డేటింగ్‌ కల్పిస్తామంటూ నమ్మించి లక్షల్లో దండుకునే మోసానికి శ్రీకారం చుట్టారు.

ఇటీవలి, కాలంలో ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిమేల్‌ ఎస్కాట్‌ సర్వీస్‌ పేరుతో చేస్తున్న ఈ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. లోకాంటో.కామ్, ఇండియా డేట్స్, మింగిల్‌ తదితర డేటింగ్‌ సైట్లలో ప్రత్యేక డేటింగ్‌ ప్యాకేజీ పేరుతో మోసగాళ్లు పోస్టులు చేస్తున్నారు. ఏ ప్రాంతమైనా ఏ సమయమైనా కాల్‌ గరŠల్స్‌ను పంపిస్తామంటూ...అంతా కస్టమర్‌ చాయిస్‌ అంటూ వల వేస్తున్నారు. కొత్త కొత్త నంబర్లతో మోసగాళ్లు వీడియో కాల్స్‌ చేస్తున్నారు. ఆ తర్వాత చాటింగ్‌ చేస్తున్నారు. కాస్త దగ్గరయ్యాక బాధితులు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ మరిన్ని డబ్బులు దండుకుంటున్నారు.

మరోవైపు అమ్మాయిలు, పెళ్లైన యువతులలతో డేటింగ్‌ చేయిపిస్తామంటూ వారి ఫోన్‌ నంబర్‌ కూడా ఇస్తామంటూ బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రారంభ చెలింపులు చేయమనడంతో బాధితులు చేస్తున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఫీజు, సేఫ్టీ డిపాజిట్‌ కింద మరిన్ని డబ్బులు లాగుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ బాధితుడి సెల్‌ కు క్యూపీ–జెడ్ ‌ఎక్స్‌ సీవీబీఎన్‌ నుంచి  ‘మ్యారీడ్‌ లేడీస్‌ నీడ్స్‌ జిమ్స్‌ మీటింగ్‌ అండ్‌ డేటింగ్‌...30కే పర్‌ డేట్‌. కాల్‌ టూ సెల్‌ నంబర్‌’ అంటూ ఎస్‌ ఎంఎస్‌ వచ్చింది. ఆ నంబర్‌ కు బాధితుడు కాల్‌ చేయగానే ప్రీతి అనే పేరుతో అమ్మాయి మాట్లాడింది. అతని వివరాలు తెలుసుకున్న ఆమె అమ్మాయిను చూపించాలంటే రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఆ తర్వాత సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ ఫీజు కింద రూ.34,015 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు.ఆ తర్వాత మరొకరు డ్రైవర్‌ కు రూ.20,000లు చెల్లించాలనడంతో నో అన్నాడు. అవి చెల్లించకుంటే మిమ్మల్ని చంపుతానంటూ బెదిరించడం తో బాధితుడు సైబరాబాద్‌ సైబర్ ‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీని తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News