అమ్మాయిల ఫొటోలతో వల విసురుతారు .. నమ్మి పొతే , అసలు సినిమా చూపిస్తారు !
సోషల్ మీడియా, మొబైల్ ద్వారా కొంతమంది అందమైన అమ్మాయిల ఫొటోలను వారికి పంపిస్తారు. ఆ తరువాత మత్తు ఎక్కించే మాయ మాటలు చెప్పి వారిని తమ ఆకర్షణలోకి తెచ్చుకుంటారు. వారి మాయలో పడేవరకు పిచ్చెక్కించే అమ్మాయిల అందమైన ఫొటోలు పంపుతూ వల విసురుతూనే ఉంటారు. అది నిజమే అని నమ్మి వచ్చిన వారికి , ఆ తర్వాత పట్టపగలే చుక్కలు చూపిస్తారు. వీడియోలు తీసి బెదిరించి, డబ్బులు లాగి మారణాయుధాలు చూపి చంపేస్తామని బెదిరింపులకు దిగుతారు. ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం తో దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్న బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యి, రెక్కీ నిర్వహించి ఏడుగురి ముఠాను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అంజలి, దీపక్, టైసన్, ప్రేమనాథ్, వినోద్, ప్రకాశ్, ఈశ్వరి అనే ఏడుగురు సభ్యుల ముఠా బెంగళూరులోని మహదేవపురం పోలీస్ స్టేషన్ పరిధి లో జీవనం సాగిస్తున్నారు బాగా డబ్బులు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని తమ దందా సాగిస్తున్నారు. ధన వంతులు, ఐటీ ఉద్యోగుల మొబైల్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతా వివరాలను సేకరిస్తారు. అనంతరం మెసేజ్ లు, ఫొటోలను పంపి వలపు వల విసురుతారు. ఎవరైనా వీరి మాట నమ్మి వస్తే అప్పుడు తమ అసలు రూపం చూపిస్తారు. ఆ వ్యక్తి తమ ప్రదేశంలోకి రాగానే అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ యువతి భర్త, ఇతర మిత్రులు లోపలికి వచ్చి గొడవ చేస్తారు. వారి వీడియోలను తీసి.. అవి చూపించి బెదిరింపులకు దిగుతారు.
తాము చెప్పినంత డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలను బయట పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కత్తులు, ఇతర ఆయుధాలను చూపి బెదిరిస్తారు. వీరి ఉచ్చులో చాలామంది చిక్కుకున్నారు. బెంగళూరు మహానగరంలో ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో వారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పక్కా ప్లాన్ తో రెక్కీ నిర్వహించారు. ఏడుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి కొన్ని వీడియోలు, కత్తులు తదితర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా, ఫోన్ కు అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లను చూసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.