సైబర్ కేటుగాళ్ల మాయాజాలం ... సిమ్‌ స్వాప్‌తో రూ. 19 లక్షల దోపిడీ !

Update: 2020-11-11 16:10 GMT
సైబర్ నేరాలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎంతోమంది సైబర్ నేరగాళ్ల భారిన పడి, లక్షల్లో డబ్బులు కోల్పోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా చూడటానికి పోలీసులు కొంతమంది ప్రతిక్షణం ఓ కంట పనిపెడుతున్నా కూడా వారు రోజుకో రూపంలో మోసం చేస్తున్నారు. అసలు సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసానికి పాల్పడతారు అని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. అయితే , ప్రభుత్వాలు , పోలీసులు అప్రమత్తం చేస్తున్నా కూడా సామాన్యుల తో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా సైబర్ దాడుల్లో చిక్కుకుంటుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే తాజాగా సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా కొత్త తరహా మోసానికి తెరతీశారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని భారీగా దోచుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ కు చెందిన ఓ వ్యాపారికి సంబంధించిన రూ. 19 లక్షలు కాజేశారు. ఎలక్ట్రికల్‌ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తకు సంబంధించిన మొబైల్‌ సిమ్ ‌కార్డు ఈ నెల 6న బ్లాక్‌ అయింది. కస్టమర్ ‌కేర్ ‌ను సంప్రదించగా నెట్ ‌వర్క్‌ సమస్య ఉండొచ్చని చెప్పారు. ఆ తర్వాత వ్యాపారి సిమ్ ‌కార్డు విషయాన్ని మర్చిపోయాడు. అకస్మాత్తుగా అతడి అకౌంట్‌ లోని రూ. 19 లక్షలు మాయం కావడంతో సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా డబ్బులు కాజేశారని నిర్ధారించుకుని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Tags:    

Similar News