16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా అమ్మకానికి.. పట్టేసిన సైబరాబాద్ పోలీసులు

Update: 2023-03-23 20:46 GMT
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16.8 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి.. విపణిలో అమ్మకానికి పెట్టిన ఒక కీలక ముఠాను పట్టేశారు సైబరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి డేటాను చోరీ చేసిన ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారాన్ని అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా చోరీ అయిన డేటా బేస్ ఎక్కడెక్కడి నుంచన్న విషయాన్ని సైతం సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

ఆ వివరాలు తెలిస్తే.. షాక్ తో నోట మాట రాలేని పరిస్థితి. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు.. పలు బ్యాంకింగ్ క్రెడిట్ కార్డులు.. పాన్ కార్డు.. పాలసీ బజార్ లాంటి పేరున్న సంస్థలకు చెందిన డేటా మాత్రమే కాదు.. పలు విద్యా సంస్థలు.. పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థల నుంచి కూడా డేటా చౌర్యం జరిగిందన్న విషయం తెలిసినప్పుడు నోటి వెంట మాట రాని పరిస్థితి. ఈ ముఠా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది డేటాను దొంగలించినట్లు గుర్తించారు.

అంతేకాదు బీమా.. అప్పు కోసం దరఖాస్తు పెట్టిన వ్యక్తుల నుంచి కూడా డేటా తస్కరించారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫేస్ బుక్ యూజటర్ల ఐడీ.. పాస్ వర్డ్స్.. ఐటీ ఉద్యోగుల డేటా కూడా భారీ ఎత్తున చోరీ అయినట్లుగా పేర్కొన్నారు. మహిళల వ్యక్తిగత డేటాను కూడా అమ్మకానికి పెట్టారని చెప్పారు. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. సైబర్ నేరగాళ్లు ఆర్మీ.. డిఫెన్స్ కు చెందిన ఉద్యోగుల డేటాను కూడా అమ్మకానికి పెట్టినట్లుగా చెప్పారు.

డేటా అమ్మకానికి పెట్టిన సంస్థలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థను కూడా తాము గుర్తించినట్లుగా చెప్పారు. జస్ట్ డయల్ సంస్థపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. వీటి వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్న నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారించి.. మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇక.. సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు సేకరించిన డేటా ఏయే సంస్థలకు సంబంధించిందన్న విషయం తెలిసినప్పుడు.. విస్మయానికి చెందటం ఖాయం.

ఇంతకూ ఆ సంస్థలు.. వాటి నుంచి ఎందరి డేటా చోరీ అయ్యిందన్న విషయానికి వస్తే..

-  ఎయిర్ టెల్ - వోడో ఫోన్ నుంచి 5 కోట్లు

-  బిగ్ బాస్కెట్ నుంచి 2 కోట్ల మంది డేటా

-  డామినోస్ నుంచి కోటి మంది డేటా

- అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కోటి మంది

-  నీట్ 2021 విద్యార్థుల డేటా

-  2020-21, 2021-22లకు చెందిన 9, 10తరగతి విద్యార్థుల డేటా

- వేదాంతుకు చెందిన 40 లక్షల మంది డేటా

-  జీఎస్టీ ట్యాక్స్ పేయర్స్ రికార్డుల నుంచి 24 లక్షలు

- మనీ కంట్రోల్ నుంచి 10 లక్షలు

-  అప్ స్టాక్ కంపెనీకి చెందిన 6 లక్షల మంది డేటా

-  క్రెడ్ డేటా బేస్ కు సంబంధించి 3 లక్షలు

-  లోన్ అప్లైడ్ నుంచి 5 లక్షలు

- రాజా బెట్స్.. బెట్టింగ్ క్యాసినో నుంచి 38వేలు

-  ఆర్టీవో ఇండియా నుంచి 4 లక్షలు

-  పాలసీ బజార్ నుంచి 4 లక్షలు

-  బ్యాంక్ బరోడాకు చెందిన 94 వేలు మరియురికార్డులు

- ఇన్ స్టా యూజర్స్

- నెట్ ఫ్లిక్స్

- పేటీఎం

- ఫోన్ పే

- యూట్యూబ్

- జమాటో

- పాన్ కార్డు హోల్డర్స్ కు సంబంధించిన డేటా

-  ఫ్రీలాన్సర్

- డ్రీమ్ 11

- ఫన్ 88

- తంబోలా.. టీన్ పట్టి తదితర సంస్థలకు చెందిన డేటా బేస్ ను తస్కరించారు



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News