దేశ పారిశ్రామిక రంగాన్నే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. అంతర్జాతీయ పత్రికలు సైతం ప్రత్యేక వార్తలు వేసిన వైనం తాజా మిస్త్రీ టాటా ఎపిసోడ్ లో కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం తానే స్వయంగా తీసుకొచ్చి పట్టం కట్టిన మిస్త్రీకి తాజాగా రతన్ టాటానే టాటా చెప్పేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరక్క మిస్టరీగా మారిన పరిస్థితి. అయితే.. మిస్త్రీ అనుసరించిన విధానాలు.. కంపెనీని ఆయన తీసుకెళుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రతన్‌టాటా.. తమ ఫిలాసఫీకి భిన్నంగా వెళుతున్న మిస్త్రీకి చెక్ చెప్పాలని డిసైడ్ అయ్యారు.
బ్రిటన్ లో ఉన్న టాటా స్టీల్ కంపెనీని అమ్మాలన్న మిస్త్రీ నిర్ణయంతో రతన్ టాటా సహనానికి పరీక్షగా మారిందని.. ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో విసుగెత్తిన ఆయన.. చివరకు టాటా గ్రూపు ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. టాటా గ్రూపు ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తప్పించిన ఎపిసోడ్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. అద్యంతం సినిమాటిక్ గా అనిపించే ఈ సీన్ విషయంలోకి వెళితే.. మిస్త్రీని అధికారికంగా తప్పించటానికి నెల రోజుల ముందే రతన్ టాటానే స్వయంగా ఆయన్ను కలిసి.. తన పదవికి రాజీనామా చేయాలని సూచించారట.
ఇక.. మిస్త్రీని తొలగించాలని రతన్ టాటాకు సలహా ఇచ్చిన త్రిమూర్తుల్లో పరాశరన్ ఒకరిగా చెబుతారు. మిస్త్రీని రతన్ టాటా స్వయంగా కలిసి ఆయన్ను ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరటం.. అందుకు ఆయన నుంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ రాకపోవటంతో.. రతన్ టాటా చెప్పిన తేదీ నుంచి నెల తర్వాత ఆయన్ను అధికారికంగా తీసేయొచ్చని.. ఎందుకంటే.. కంపెనీలో మెజార్టీ రతన్ పక్షాన ఉండటంగా చెబుతున్నారు. బోర్డులో రతన్ కున్న బలం నేపథ్యంలో.. నోటి మాటగా చెప్పిన రోజు నుంచి మిస్త్రీ కౌంట్ మొదలైందని..అదే నోటీస్ పీరియడ్ గా మారి.. నెల తర్వాత ఆయన్ను తొలగిస్తూ అధికారిక నిర్ణయాన్ని బయటకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తనకు చట్టపరంగా ఇవ్వాల్సిన 15 రోజుల నోటీసు ఇవ్వలేదని మిస్త్రీ వాదిస్తున్న వైనం తెలిసిందే. మరి..రతన్ టాటా చెప్పిన నోటి మాటనే నోటీస్‌గా ఆయన భావించారా? అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఏమైనా.. తాను ఏరికోరి తెచ్చుకున్న వారసుడ్ని.. తన చేతులతోనే తొలగించే పరిస్థితి ఎదురవుతుందని రతన్ టాటా ఊహించి ఉండరు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/