తెలంగాణలో సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకు పడే టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ - మాజీ మంత్రి డీకే అరుణకు తెలంగాణ సీఎం కేసీఆర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారా..? ఈ ఆఫర్ తో అరుణను గులాబి గూట్లో చేర్చుకునేందుకు టీఆర్ ఎస్ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తుందా ? ఈ ప్రయత్నంలో టీఆర్ ఎస్ సక్సెస్ అయ్యిందా ? అంటే అవుననే సంకేతాలే తెలంగాణ ఇన్నర్ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఇన్నర్ పాలిటిక్స్‌లో ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
టీఆర్ ఎస్ అన్నా, సీఎం కేసీఆర్ అన్నా డీకే అరుణ ఒంటి కాలిమీద లేచిపోతారు. టీ కాంగ్రెస్ లో ఎంతో మంది తలపండిన సీనియర్లు ఉన్నా అరుణ కేసీఆర్ - టీఆర్ ఎస్ టార్గెట్ గా చేసి పేల్చే డైలాగ్సే హైలెట్ అవుతుంటాయి. అయితే డీకే అరుణ కోరుకున్నట్టు ఎప్పుడైతే ప్రత్యేక జోగులాంబ గద్వాల్ జిల్లా ఏర్పాటు అయ్యిందో అప్పటి నుంచి ఆమె సైలెంట్ అవుతూ వస్తున్నారు. కేసీఆర్ - టీఆర్ ఎస్ పై స్పీడ్ తగ్గించారు.
అరుణ కండువా మార్చేస్తున్నారని టాక్ కూడా వచ్చింది. అయితే దీనిపై స్పందించిన ఆమె గద్వాల్ జిల్లా ఏర్పాటుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెపుతూనే...తాను టీఆర్ ఎస్ లో చేరనని చెప్పారు. అరుణ పైకి ఎలా మాట్లాడినా ఇన్నర్ గా మాత్రం ఆమె పార్టీ మారేందుకు స్కెచ్ రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత సైతం అరుణ పార్టీ మారనున్నారని ఓపెన్ గా చెప్పి..బాంబు పేల్చారు.
డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నారు. 1999 నుంచి వరుసగా ఓటమి లేకుంగా గద్వాల్ నుంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇక కేసీఆర్ అరుణ కోరినట్టు గద్వాల్ జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు ఆమె టీఆర్ ఎస్ లోకి వస్తే కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే తెలంగాణ హోం మంత్రి.
తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందడంతో పాటు బలమైన వాయిస్ ఉన్న మహిళా నేత కావడంతో ఆమె కోసం కేసీఆర్ స్వయంగా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. టీఆర్ఎస్‌కు బలమైన మహిళా నేతల కొరత కూడా ఉంది. కేసీఆర్ కేబినెట్‌లో మహిళా మంత్రులు ఎవ్వరూ లేరు.
అరుణతో ఒకేసారి రెడ్డి కోటా+మహిళా కోటా+వెనకబడిన గద్వాల్ జిల్లాకు ఏకంగా హోం మంత్రి కోటా ఇలా అన్ని కోటాలు భర్తీలు చేసి..విమర్శల నోళ్లకు తాళం వేసేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. త్వరలోనే జరిగే కేబినెట్ ప్రక్షాళనలో ప్రస్తుతం హోం మంత్రి నాయినిని తప్పించి...ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి ఆ ప్లేస్ ను అరుణతో భర్తీ చేయడానికి రంగం సిద్ధమైందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/