తమ పార్టీలోకి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కు.. ఆయన హోదాకు తగిన పదవి ఇస్తామని చెప్పిన దానికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ మధ్యనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించి.. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినా.. డీఎస్ మాత్రం పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఎందుకంటే.. ఆయనకు ఎక్కడ చాంబర్ ఇవ్వాలో తేల్చుకోలేకపోవటమే కారణంగా చెబుతున్నారు. తాజాగా ఆ విషయంలో స్పష్టత వచ్చేసింది. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజయ్యకు కేటాయించిన ఛాంబర్ ను తాజాగా డీఎస్ కు కేటాయించారు.
ఆరోపణల మీద రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించటం తెలిసిందే. తెలంగాణ సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో తాజా డీఎస్ ఛాంబర్ ను కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం రోజున డీఎస్ తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి డీఎస్ ఇక.. తెలంగాణ సచివాలయంలో కనువిందు చేయనున్నారన్న మాట.