డీఎస్‌కు ద‌క్కే గౌర‌వం అదేనా?

Update: 2015-07-25 08:10 GMT
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ప్ర‌క‌టించిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత డీఎస్ ఈ మధ్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌లో ఏ ప‌ద‌వి ఆశించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ..ఆ ప్ర‌క‌ట‌న వెన‌క కూడా లాజిక్ వేరే ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌రోక్షంగా డీఎస్ త‌న మ‌న‌స‌సులోని మాట బ‌య‌ట‌పెట్టార‌నే చ‌ర్చ సాగుతోంది.

టీఆర్ఎస్‌లో చేరిన‌ప్ప‌టి నుంచి డీఎస్ తన సెంటిమెంట్‌ను గౌర‌విస్తూ ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్‌ లో చేరిన తర్వాత  మీడియా తో మాట్లాడటాని కి కూడా డీఎస్ ముహూర్తం పెట్టుకున్నారట. త‌న ఇంటికి కేసీఆర్ వ‌చ్చిన రోజే మీడియా తో డీఎస్  మాట్లాడాల్సి ఉన్న‌ప్ప‌టికీ గురువారం మీడియా తో మాట్లాడటానికి ఆయన సెంటిమెంటే కారణమని స‌మాచారం. సాయిబాబా ని నమ్ముకున్నప్పటి నుంచి అంతా మంచే జరిగిందని, అందుకే గురువారం సెంటిమెంట్ డే అని డీఎస్ స‌న్నిహితుల‌ తో చెప్తుంటారు. అయితే ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర అంశం ఉంది. డీఎస్ టీఆర్ఎస్‌ లో చేరింది బుధవారం. ఇందుకు కార‌ణం ఏంటంటే...గురువారం అష్టమి రావడంతో బుధవారమే డీఎస్‌ కండువా మార్చేశారు. అష్టమి  రోజున కేసీఆర్ కూడా పార్టీ లో చేరికలకు ఒప్పుకోరు కాబట్టి ముందురోజే కారెక్కారు డీఎస్.

ఇంత‌కు మీరు టీఆర్ఎస్‌ లో ఏ పదవి ఆశిస్తున్నారని డీఎస్‌ను ప్రశ్నిస్తే.... అన్ని పదవుల్ని అనుభవించాను, రాని పదవి అదొక్కటే, అది ఆయన ఇవ్వలేడు నేను  అడగలేనని డీఎస్ చెప్పడం కొసమెరుపు. ఇంతకీ డీఎస్ చేపట్టని ఆ ఒక్క పదవి సీఎం పోస్టే. దీంతో డీఎస్ మదిలో అసలేముందున్నదానిపై ఇంటా బయటా ఒకటే గుసగుసలు.
Tags:    

Similar News