అనుకున్నట్లే డి. శ్రీనివాస్ పార్టీ మారిపోయారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా ఉన్న ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయనిప్పుడు టీఆర్‌ఎస్‌కు చెందిన నేత. హస్తాన్ని వదిలేసి కారు ఎక్కే క్రమంలో చేరుతున్న పార్టీని పొగిడేయటం.. ఆ పార్టీ అధినేతను వీరుడు.. శూరుడు అని కీర్తించటం మామూలే. తమ పార్టీలోకి వస్తున్న నేతను పొడగటం కూడా కామనే.
కాకుంటే.. తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరే సందర్భంగా డీఎస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా.. కాస్తంత ఆశ్చర్యకరంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టటం ద్వారా.. ఆ పార్టీతో రాం రాం అన్నట్లే. అయితే.. కాంగ్రెస్‌ను వదిలిపెట్టినప్పటికీ.. ఆ పార్టీ అధినేత సోనియాగాంధీని మాత్రం తాను గౌరవిస్తానని చెప్పుకున్నారు. అదే సమయంలో తాను పార్టీలో చేరుతున్న టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను తెలంగాణలో బలోపేతం చేస్తానంటూ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ బలోపేతం కావటం అంటే.. అమ్మ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనం కావటమే. అదే జరిగితే.. డీఎస్ అమితంగా గౌరవించే సోనియమ్మకు కష్టం చేసినట్లే. ఒక మనిషి మీద గౌరవం ఉంటే.. ఆ వ్యక్తికి ఇబ్బంది కలగకుండా.. ఆ వ్యక్తి గౌరవ మర్యాదలకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. డీఎస్ చేరిన సందర్భంగా.. ఆ వేదిక మీద నుంచే మాట్లాడిన నేతలు.. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్న వ్యాఖ్య చేశారు.
నిజంగా డీఎస్ కానీ సోనియాగాంధీని అమితంగా గౌరవిస్తే.. ఆమె నొచ్చుకునేలా తెలంగాణ కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తానన్న మాట రాకుండా చేయాలి కదా. కాంగ్రెస్‌లో కొనసాగినంత కాలం కొనసాగి.. పదవులు అనుభవించి ఈ రోజున పార్టీ మారటాన్ని డీఎస్ సమర్థించుకోవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో దీన్ని ఎవరూ కాదనరు. కానీ.. పార్టీ మారిపోయి కూడా.. తాను గతంలో ఉన్న పార్టీ అధినేతను చాలా గౌరవంగా చూస్తానని చెప్పటంలోనే చిక్కు అంతా. నిజంగా అంత గౌరవమే ఉంటే.. ఆమె ఆగ్రహం చెందేలా పార్టీ మారరు కదా. పార్టీ మారిన తర్వాత కూడా ఈ మర్యాదలు.. గౌరవాలు ఇస్తానని చెప్పటం ఏమిటో..?