దర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ బీసీ నాయకుడు నెలరోజుల క్రితం వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన టీఆర్ ఎస్ లో చేరారు. తాజాగా ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా బాద్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్నాళ్లు తాను కొనసాగిన కాంగ్రెస్ పార్టీ తనకేం చేసిందని ప్రశ్నించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు కాంగ్రెస్ ద్వారా దక్కింది ఏంటని నిలదీశారు ఈ మాజీ మంత్రి. తన చిత్తశుద్ధి చూసే కేసీఆర్ ప్రత్యేక సలహాదారు బాధ్యతలు అప్పగించారని అన్నారు. బంగారు తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ రిటైర్ కారని ఆయన్ను కీర్తించారు. తెలంగాణను ముందుకు నడిపించడంలో కేసీఆర్ కు మంచి విజన్ ఉందని కీర్తించారు. విజనరీ నాయకుడిగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు సమస్యల పరిష్కారం కోసం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు.
పనిలో పనిగా బంగారు తెలంగాణ బ్యాచ్ పై స్పందించారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనలాగా చేరి పదవులు పొందిన వారిని ఉద్దేశించి వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇదేమీ కొత్త కాదని, ఇపుడే ప్రారంభం అయింది అంతకంటే కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ర్టాలతో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తాను శాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు.