జ‌గ‌న్ బాట‌లోకి!..ఎన్టీఆర్ మ‌వ‌న‌డు!

Update: 2018-12-30 11:20 GMT
ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అప్ప‌టిదాకా ఓ పార్టీలో కొన‌సాగిన నేత‌లు... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కీల‌క త‌రుణంలో త‌మ భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకుంటూ అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు మార్చుకుని వైరి వ‌ర్గాల్లో చేరిపోతున్నారు. అంతేకాకుండా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో చాలా మంది యువ కెర‌టాలు ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగేందుకు సంసిద్ధ‌మ‌వుతున్నారు. ఈ త‌ర‌హా యువ కెర‌టాలు అటు అధికార టీడీపీ నుంచే కాకుండా ఇటు విప‌క్ష వైసీపీ నుంచి కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉన్న‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. టీడీపీ నుంచి ఈ సారి బ‌రిలోకి దిగేందుకు ప‌రిటాల ర‌వి కుమారుడు శ్రీ‌రామ్‌ - జేసీ బ్ర‌ద‌ర్స్ కుమారులు ప‌వ‌న్‌ - అక్షిత్‌ - టీజీ వెంక‌టేశ్ కుమారుడు భ‌ర‌త్‌ - అయ్య‌న్న‌పాత్రుడి కుమారుడు విజ‌య్‌ - బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంది. అదే స‌మ‌యంలో ఇటు వైసీపీ నుంచి కూడా ఎంట్రీ ఇచ్చే యువ‌నేత‌ల జాబితా కూడా పెద్ద‌గానే ఉంది. వీరిలో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ - కాసు మ‌హేశ్ రెడ్డి - లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు - బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి - కొఠారు అబ్బ‌య్య చౌద‌రి... ఇలా ఈ జాబితా కూడా చాంతాడంత ఉంది. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న పూర్తి అయితే టీడీపీ నుంచి పోటీ చేసే యువ కెర‌టాల కంటే... వైసీపీ టికెట్లు ద‌క్కే యువ తేజాల సంఖ్యే అధికంగా ఉంటుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఈ విశ్లేష‌ణ‌ల‌కు బలం చేకూరుస్తూ... ఇప్పుడు తెలుగు నేల రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫ్యామిలీ వార‌సుడిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంట్రి ఇవ్వ‌నున్న ద‌గ్గుబాటి హితేశ్ కూడా వైసీపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకుంటున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ కూతురు - బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి - మాజీ మంత్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుల కుమారుడైన హితేశ్... లోకేశ్ మాదిరే ఎన్టీఆర్‌ కు మ‌న‌వ‌డే. అయితే ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా ఓ ఇమేజీ ఉన్న హితేశ్... ఇప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో కాకుండా ఆ పార్టీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న వైసీపీలో చేరేందుకు పావులు క‌దుపుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్టీఆర్ మ‌న‌వ‌లుగా నారా లోకేశ్ - ద‌గ్గుబాటి హితేశ్ ల మ‌ధ్య బంధుత్వంతో పాటు మంచి స్నేహం కూడా ఉంద‌ట‌. అయినా కూడా హితేశ్ వైసీపీ వైపు చూస్తుండ‌టం నిజంగానే ఆశ్చ‌ర్య‌మే. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి పార్టీని అధికారాన్ని చేజిక్కించుకున్న స‌మ‌యంలో త‌న వెంట న‌డిచిన వెంక‌టేశ్వ‌ర‌రావును చంద్ర‌బాబు ఆ త‌ర్వాత పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ద‌గ్గుబాటి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయ‌న కాస్తంత సైలెంట్ గా ఉన్నా... ఆయ‌న స‌తీమ‌ణి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్నారు.

అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ ఏపీలోఎదురీదుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న త‌న‌యుడి రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి బీజేపీ ప‌నికి రాద‌న్న భావ‌న‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఉంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ తో క‌లిసి న‌డిచే విష‌యంలో హితేశ్ పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు పురందేశ్వ‌రితో పాటు వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా ఓకే చెప్పేసిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన హితేశ్ ఇప్ప‌టికే రెండు, మూడు ప‌ర్యాయాలు వైసీపీ కీల‌క నేత‌ల‌తో భేటీ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మ సొంత నియోజ‌కవ‌ర్గం ప‌ర్చూరు టికెట్ ను ఆశిస్తున్న హితేశ్ కు... టీడీపీ నుంచి ఆదిలోనే అడ్డంకి ఎదురు కావ‌డం కూడా ఆయ‌న వైసీపీ వైపు చూడ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. హితేశ్ వైసీపీలో చేరి - ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే... గెలుపు విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌నే వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... త‌న వ‌రుస‌కు సోద‌రుడు - త‌న పిన్న‌మ్మ కుమారుడు - త‌న‌కంటే చిన్న‌వాడు అయిన హితేశ్ నేరుగా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైతే... ఆ ప‌ని చేత‌కాని లోకేశ్ పై మ‌రింత మేర విమ‌ర్శ‌లు పెరుగుతాయ‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News