దళిత మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు.. ముగ్గురు నానిలతో ముప్పు

Update: 2020-11-17 05:30 GMT
బెంగళూరుకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి చెందిన ముగ్గురు అధికారపక్ష నేతలపై ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు పేర్ని నాని.. కొడాలి నాని.. ఆళ్ల నానిల తీరుపై లక్ష్మీ నరసింహన్ అనే దళిత మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనంగా మారిన ఆమె చెప్పిన వివరాల్ని చూస్తే..

క్రిష్ణా జిల్లాకు చెందిన తాను చాలా ఏళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లిపోయానని.. అక్కడే స్థిరపడ్డానని చెప్పారు. సొంత రాష్ట్రంలో ఏదైనా  వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో గుడివాడ సమీపంలోని నందివాడలో 150 ఎకరాల చేపల చెరువును లీజుకు తీసుకున్నట్లు చెప్పారు. ‘‘లాక్ డౌన్ వేళలో నూకల రామకృష్ణ.. నూకల బాలాజీ నుంచి లీజుకు తీసుకున్నా. లాక్ డౌన్ వేళ ఏడాదికి ఎకరా రూ.60వేలకు లీజుకు ఇచ్చిన వారు ఆ తర్వాత రూ.90 వేలు డిమాండ్ చేయటంతో అంగీకరించి 2023 వరకు లీజు ఒప్పందం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు.

ఏప్రిల్ లో చేపలు అమ్మేందుకు సిద్ధమవుతుంటే.. లీజుకు ఇచ్చిన వ్యక్తులు తక్కువ ధరకు చేపల్ని తమకే అమ్మాలని డిమాండ్ చేశారు. అందుకు నో చెప్పానని తనపై దౌర్జన్యం చేశారన్నారు. తనపై దాడి చేయటమే కాదు.. 150 ఎకరాల్లో రొయ్యల్ని తరలించుకు వెళ్లారన్నారు. దీనిపై కంప్లైంట్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. స్పందనలో రెండుసార్లు.. రాష్ట్ర డీజీపీకి అక్టోబరులో మరోసారి ఫిర్యాదు చేశానన్నారు.

చివరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.నిందితులకు మంత్రులు ఆళ్ల నాని.. పేర్ని నాని.. కొడాలి నాని ముగ్గురు అండ ఉండటమే కారణమన్నారు. ఆ ముగ్గురు నానిల కారణంగా తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. మరి..ఈ ఉదంతంపై సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News